తెలంగాణ

telangana

108లోనే మహిళ ప్రసవం.. తల్లీబిడ్డ క్షేమం

By

Published : Jan 13, 2021, 8:29 PM IST

108 వాహనంలో ఓ మహిళ పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. ఆసుపత్రికి తరలించే క్రమంలోనే నొప్పులు ఎక్కువ అవగా.. అంబులెన్స్ వాహన సిబ్బంది ఆమెకు పురుడు పోశారు.

childbirth in a 108 vehicle  in nirmal district
108 వాహనంలో మహిళ ప్రసవం

పురిటి నొప్పులతో బాధపడుతున్న ఓ గర్భిణీ 108 వాహనంలో పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. నిర్మల్ జిల్లా సారంగాపూర్ మండలంలోని బీరవెల్లి గ్రామానికి చెందిన ఇప్ప సరిత పురిటి నొప్పులు రాగా.. భర్త 108 వాహనానికి సమాచారం అందిచాడు.

వెంటనే ఈఎంటీ ప్రభాకర్, పైలెట్ జ్ఞానేశ్వర్లు మహిళను 108 అబులెన్స్​లో నిర్మల్ ప్రసూతి ఆసుపత్రికి తరలిస్తుండగా.. నొప్పులు ఎక్కువయ్యాయి. మార్గమధ్యంలో ఈఎంటి ప్రభాకర్ అంబులెన్స్​లో చికిత్స అందించి పురుడు పోశాడు. తల్లి, బిడ్డలు క్షేమంగా ఉన్నారని, మెరుగైన చికిత్స కోసం జిల్లా ప్రభుత్వ ప్రసూతి ఆసుపత్రికి తరలించినట్లు అంబులెన్స్ సిబ్బంది తెలిపారు. సరైన సమయంలో స్పందించి తల్లి, బిడ్డల్ని కాపాడిన సిబ్బందిని పలువురు అభినందించారు.

ఇదీ చూడండి: 'ఉప్పెన' టీజర్: మనిద్దరి మధ్య ప్రేమ ఎందుకని..

ABOUT THE AUTHOR

...view details