తెలంగాణ

telangana

రైతు వ్యతిరేక విధానాలను అడ్డుకోవాలి: నంది రామయ్య

By

Published : Sep 14, 2020, 5:19 PM IST

నిర్మల్​ జిల్లా కేంద్రంలోని కలెక్టర్​ కార్యాలయం ఎదుట భారత రైతుకూలీ సంఘం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. రైతు వ్యతిరేక బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టొద్దంటూ డిమాండ్ చేశారు.

Anti-farmer policies must be resisted: Nandi Ramaiah
రైతు వ్యతిరేక విధానాలను అడ్డుకోవాలి: నంది రామయ్య

వ్యవసాయాన్ని కార్పొరేటీకరణ చేసేందుకు కేంద్రం కుట్ర పన్నిందని, అందులో భాగంగానే కొత్త విధానాలను తీసుకొస్తోందని భారత రైతుకూలీ సంఘం జిల్లా అధ్యక్షులు నంది రామయ్య ఆరోపించారు. రైతు వ్యతిరేక బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టొద్దంటూ నిర్మల్ జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టారు.

భారత వ్యవసాయ రంగాన్ని కార్పొరేట్​లకు అప్పగించేందుకు కేంద్ర ప్రభుత్వం చూస్తుందని రామయ్య ఆరోపించారు. పార్లమెంటులో నిత్యావసరాలు, వ్యవసాయ ఉత్పత్తుల అమ్మకం, కార్పొరేట్ వ్యవసాయం బిల్లులు ప్రవేశపెడుతున్నారని తెలిపారు. విద్యుత్ బిల్లుల పేరుతో ప్రైవేట్ శాఖలకు ఇచ్చే కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. ఈ బిల్లులతో రైతుల ఆత్మహత్యలు పెరిగే అవకాశం ఉందన్నారు. కేంద్ర ప్రభుత్వ తీరు మార్చుకోవాలని డిమాండ్​ చేశారు. కార్యక్రమంలో ఏఐకేఎంఎస్ జిల్లా కార్యదర్శి రాజు, వ్యసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి కుమార్, అధ్యక్షులు తిరుపతి, జిల్లా నాయకులు ఉపాలి తదితరులు పాల్గొన్నారు.

పార్లమెంట్​ ముందుకు తొలి దఫా అనుబంధ పద్దు

ABOUT THE AUTHOR

...view details