తెలంగాణ

telangana

అయ్యప్ప స్వాములకు అన్నదానం చేసిన ముస్లిం యువకుడు

By

Published : Dec 30, 2022, 7:26 PM IST

అయ్యప్ప దీక్ష చేపట్టిన స్వాములకు అన్నదానం చేసి ఓ ముస్లిం యువకుడు మత సామరస్యాన్ని చాటుకున్నాడు. మతాలు వేరైనా.. మనుషులంతా ఒక్కటే అనే భావనతో అన్నదానం చేసినట్లు తెలిపాడు.

అయ్యప్ప స్వాములకు ముస్లిం యువకుడు అన్నదానం.
అయ్యప్ప స్వాములకు ముస్లిం యువకుడు అన్నదానం.

అయ్యప్ప దీక్ష చేపట్టిన స్వాములకు అన్నదానం చేసి ముస్లిం యువకుడు మత సామరస్యాన్ని చాటుకున్నాడు. వివరాల్లోకి వెళ్తే.. నిర్మల్ జిల్లా సోన్ మండలంలోని కడ్తాల్​లోని అయ్యప్ప ఆలయంలో గంజాల్ గ్రామానికి చెందిన ఎంపీపీ కో-ఆప్షన్ సభ్యుడు షేక్ ఫక్రోద్దిన్ అయ్యప్ప స్వాములకు శుక్రవారం అన్నదానం చేశాడు. దగ్గరుండి స్వాములకు భోజనాన్ని వడ్డించాడు. ఈ సందర్భంగా ఎన్నో రోజులుగా అయ్యప్ప స్వాములకు అన్నదానం చేయాలనుకుంటున్నానని, ఆ కోరిక నేడు నెరవేరిందని ఫక్రోద్దిన్​ హర్షం వ్యక్తం చేశాడు.

మతాలు వేరైనా మనుషులంతా ఒక్కటే అనే భావనతో అన్నదానం చేసినట్లు తెలిపాడు. అంతకుముందు గురుస్వామి నర్సారెడ్డి ఆధ్వర్యంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు చేపట్టారు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details