తెలంగాణ

telangana

మోదీ చిత్రపటం కోసం ఆందోళన.. పోలీసుల లాఠీఛార్జ్

By

Published : Dec 29, 2020, 8:31 PM IST

నారాయణపేట జిల్లా ధన్వాడలో పలువురు భాజపా కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేశారు . మక్తల్ పట్టణ కేంద్రంలోని 167 వ జాతీయ రహదారిపై పోలీసుల వైఖరి మారాలంటూ భాజపా నాయకులు రాస్తారోకో నిర్వహించారు.

the-bjp-leaders-were-arrested-by-the-police-and-lathicharged-in-narayanpeta-district
రైతు వేదికపై ప్రధాని చిత్రాన్ని ఏర్పాటు చేయాలని..

నారాయణపేట జిల్లా ధన్వాడలో .. స్థానిక భాజపా నాయకులపై పోలీసులు లాఠీఛార్జ్ చేశారు. రైతు వేదికపై ప్రధాని మోదీ చిత్రాన్ని ఏర్పాటు చేయాలని స్థానిక భాజపా నాయకులు కొన్ని రోజులుగా కోరుతున్నారు. దీనిపై స్పందన లేకపోవటంతో.. రాత్రి రైతు వేదిక భవనం పై ప్రధాని చిత్రాన్ని ఏర్పాటు చేశారు. గుర్తించిన తెరాస నాయకులు దాన్ని తొలగించటంతో భాజపా నాయకులు మంత్రుల పర్యటనను అడ్డుకోవాలని నిర్ణయించారు. అందులో భాగంగా.. ఈ నెల 28న రైతు వేదిక ప్రారంభోత్సవానికి వస్తున్న మంత్రులు నిరంజన్ రెడ్డి , శ్రీనివాస్ గౌడ్ పర్యటనను అడ్డుకోవాలని ప్రయత్నించారు.

ప్లకార్డులు పట్టుకుని ..

రైతు వేదికపై ప్రధాని మోదీ చిత్రాన్ని ఏర్పాటు చేయాలని ప్లకార్డులు పట్టుకుని రైతు వేదిక వద్ద మంత్రుల కాన్వాయ్​కు అడ్డు వచ్చారు. వారిపై పోలీసులు లాఠీఛార్జీ చేసి వారిని చెదరగొట్టారు. దీంతో మక్తల్ పట్టణ కేంద్రంలోని 167 వ జాతీయ రహదారిపై స్థానిక పోలీసుల వైఖరి మారాలంటూ అరగంటకు పైగా రాస్తారోకో నిర్వహించారు. వీరిని పోలీసులు అరెస్టు చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు.

ఇదీ చదవండి:స్థానిక సంస్థల ఎన్నికలే దేశ పరిపాలనకు పునాది: దత్తాత్రేయ

ABOUT THE AUTHOR

...view details