తెలంగాణ

telangana

గోనె సంచుల కొరతతో రైతుల రాస్తారోకో

By

Published : May 7, 2021, 2:27 PM IST

ధాన్యం కొనుగోళ్ల సమయంలో గోనె సంచుల కొరత ఏర్పడిందని మక్తల్​లో రైతులు రాస్తారోకో చేపట్టారు. గోదాముల వద్ద పడిగాపులు కాస్తున్నా లభించడం లేదని వాపోయారు. ఎస్సై రాములు ఘటనా స్థలికి వచ్చి రైతుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు.

Farmers protest about the shortage of bags, family strike
బస్తాల కోసం రైతుల ధర్నా, మక్తల్​లో రైతుల ఆందోళన

వరి ధాన్యం కొనుగోళ్లు జరుగుతున్న నేపథ్యంలో గోనె సంచుల కొరత ఏర్పడిందని నారాయణపేట జిల్లా మక్తల్​లో రైతులు ఆందోళన చేపట్టారు. గోదాముల వద్ద పడిగాపులు కాస్తున్నా... అందడం లేదని వాపోయారు. దళారులు వచ్చి తీసుకెళ్తున్నారని చెప్పారు. రైతులకు అన్యాయం జరుగుతోందని అంబేడ్కర్ చౌరస్తా వద్ద రాస్తారోకో చేపట్టారు.

ఎస్సై రాములు ఘటనా స్థలానికి చేరుకుని రైతుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అధికారులతో మాట్లాడి గోనె సంచుల కొరత లేకుండా చూస్తామని హామీ ఇవ్వడంతో రాస్తారోకో విరమించారు.

ఇదీ చదవండి:భోజనం తర్వాత ఓ గంటసేపు...

ABOUT THE AUTHOR

...view details