తెలంగాణ

telangana

పోయిరా బతుకమ్మ.. పోయిరావమ్మా!

By

Published : Oct 7, 2019, 1:32 PM IST

ఉమ్మడి నల్గొండ జిల్లాలో నిన్న జరిగిన సద్దుల బతుకమ్మ వేడుకులు ఘనంగా నిర్వహించారు. చివరి రోజు కావటం వల్ల మహిళలలు, యువతులు, చిన్నారులు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు.

పోయిరా బతుకమ్మ.. పోయిరావమ్మా!

సద్దుల బతుకమ్మ సంబరాలు... అంగరంగ వైభవంగా జరిగాయి. నల్గొండ, సూర్యాపేట, యాదాద్రి భువనగిరి జిల్లాల్లో వేడుకల చివరి రోజు పెద్దసంఖ్యలో మహిళలు, యువతులు, చిన్నారులు ఆడిపాడారు. నల్గొండ జిల్లా కేంద్రంలోని రామాలయం, వీటీ కాలనీలోని వేంకటేశ్వర ఆలయం, శివాజీ నగర్ చౌరస్తా తదితర ప్రాంతాల్లో బతుకమ్మ ఆడారు. అనంతరం పట్టణ శివారులోని వల్లభరావు చెరువులో... నిమజ్జనం చేశారు. జిల్లా కేంద్రంతోపాటు దేవరకొండ, మిర్యాలగూడ అటు సూర్యాపేటతోపాటు జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో సంబరాలు ఘనంగా జరిగాయి. యాదాద్రి జిల్లాలోని భువనగిరి, యాదగిరిగుట్టతోపాటు అన్ని మండలాల్లోనూ బతుకమ్మ వేడుకల్ని ఘనంగా నిర్వహించారు.

పోయిరా బతుకమ్మ.. పోయిరావమ్మా!
Intro:Body:Conclusion:

ABOUT THE AUTHOR

...view details