తెలంగాణ

telangana

మునుగోడు ఉపఎన్నిక కౌంటింగ్​ షురూ.. 9 గంటలకు తొలిరౌండ్​ ఫలితం

By

Published : Nov 6, 2022, 8:29 AM IST

Munugode by Elections Counting: మునుగోడు ఉపఎన్నిక ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. పరిశీలకులు, ఏజెంట్ల సమక్షంలో అధికారులు స్ట్రాంగ్ రూమ్‌ తెరిచారు. మొదట పోస్టల్‌ బ్యాలెట్‌ ఓట్లను లెక్కిస్తున్నారు.

munugode by elections counting begins at nalgonda district
munugode by elections counting begins at nalgonda district

Munugode by Elections Counting: మునుగోడు ఉపఎన్నిక ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. పరిశీలకులు, ఏజెంట్ల సమక్షంలో అధికారులు స్ట్రాంగ్ రూమ్‌ తెరిచారు. మొదట పోస్టల్‌ బ్యాలెట్‌ ఓట్లు లెక్కిస్తున్నారు. అనంతరం ఈవీఎంలలోని ఓట్లు లెక్కించనున్నారు. నియోజకవర్గంలో 686 పోస్టల్ బ్యాలెట్ ఓట్లు నమోదు కాగా.. ఇవి పూర్తైన తర్వాత ఈవీఎంలలో పోలైన ఓట్లను లెక్కిస్తారు. ఓట్ల లెక్కింపు కోసం మొత్తం 21 టేబుల్స్ ఏర్పాటు చేయగా.. 15 రౌండ్లలో కౌంటింగ్ పూర్తి కానుంది. ఒక్కో రౌండ్‌లో 21 పోలింగ్ స్టేషన్‌లలో నమోదైన ఓట్లను లెక్కిస్తారు.

మొత్తం 298 పోలింగ్ కేంద్రాల్లో నమోదైన ఓట్లను 15 రౌండ్​లలో లెక్కిస్తారు. ఒక్కో టేబుల్‌కి కౌంటింగ్ సూపర్‌వైజర్, అసిస్టెంట్ సూపర్‌వైజర్, మైక్రో అబ్జర్వర్‌లను నియమించారు. మొదటి రౌండ్ ఫలితం ఉదయం 9 గంటలకు వెల్లడి కానుంది. చివరి రౌండ్ ఫలితం ఒంటి గంట వరకు విడుదల అవుతుందని అధికారులు భావిస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details