తెలంగాణ

telangana

రైతులను తొక్కించే మోదీ కావాలా? రైతుబంధు ఇచ్చే కేసీఆర్‌ కావాలా? : కేటీఆర్

By

Published : Nov 1, 2022, 3:46 PM IST

KTR in munugode bypoll campaign మునుగోడు ఉపఎన్నిక ప్రచారం నేటితో ముగియనున్న నేపథ్యంలో అన్ని పార్టీలు జోరుగా ప్రచారాన్ని నిర్వహిస్తున్నాయి. ఈ క్రమంలోనే మునుగోడులో రోడ్‌షో నిర్వహించిన కేటీఆర్... మోదీ ప్రభుత్వంపై మరోసారి విరుచుకుపడ్డారు. రైతులను తొక్కించే మోదీ కావాలా? రైతుబంధు ఇచ్చే కేసీఆర్‌ కావాలా? అని ప్రజలను ప్రశ్నించారు.

Ktr
Ktr

KTR in munugode bypoll campaign మునుగోడులో భాజపా గెలిస్తే.. సిలిండర్ ధర రూ.1500 అవుతుందని కేటీఆర్ ఆరోపించారు. గ్యాస్‌ ధర ఎంత పెంచినా భాజపాకే ఓటు వేస్తున్నారని మరింత పెంచుతారని అభిప్రాయపడ్డారు. గుజరాత్‌ నుంచి వచ్చే డబ్బులతో గెలవాలని రాజగోపాల్‌రెడ్డి చూస్తున్నారని విమర్శించారు. మోదీ పాలనలో ఏ ఒక్క వర్గానికైనా మేలు జరిగిందా? అని ప్రశ్నించారు. ఏటా రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామన్న హామీ నెరవేర్చారా? అని మండిపడ్డారు. లఖింపుర్‌ఖేరీలో భాజపా నేతలు రైతులను కార్లతో తొక్కి చంపారని ఆరోపణలు చేశారు.

KTR FIRES ON MODI ''రైతులను తొక్కించే మోదీ కావాలా? రైతుబంధు ఇచ్చే కేసీఆర్‌ కావాలా? గ్యాస్‌ ధర రూ.1100 చేసి వంటింట్లో పొగబెట్టిన మోదీకి ఓటు వేస్తారా? ఫ్లోరోసిస్‌ సమస్యను గత ప్రభుత్వాలు పట్టించుకున్నాయా? ఇంటింటికి మంచినీరు ఇచ్చి ఫ్లోరోసిస్‌ను రూపుమాపింది కేసీఆర్‌. కార్పొరేట్లకు వత్తాసు పలికే మోదీ పార్టీకి డిపాజిట్లు కూడా రావొద్దు. పలివెలలో తెరాస నేతలపై భాజపా గుండాలు దాడి చేశారు. ఓటమి ఖాయమైన భాజపా దాడులకు దిగుతోంది. ఓట్లతోనే భాజపాకు బుద్ధి చెప్పాలి. దాడి చేసిన వారిపై చట్టపరంగా చర్యలు ఉంటాయి. ఎంత రెచ్చగొట్టినా తెరాస శ్రేణులు ఉద్రేకపడొద్దు'' అని కేటీఆర్ వివరించారు.

ABOUT THE AUTHOR

...view details