తెలంగాణ

telangana

వార్ వన్​సైడే.. ఆ మూడు పార్టీలకు డిపాజిట్లు కూడా దక్కవ్: కేఏ పాల్​

By

Published : Oct 24, 2022, 5:09 PM IST

ka paul campaign in munugode మునుగోడులో కేఏ పాల్ ప్రచారం ఊపందుకుంది. మునుగోడు ప్రజలకు హామీల వర్షం కురిపిస్తూ... నవ్వులు తెప్పిస్తున్నారు. 6నెలల్లో మునుగోడును అమెరికా చేసి పడేస్తా అన్న కేఏ పాల్... వార్ వన్​ సైడ్ అయిందని వ్యాఖ్యానించారు. ఆ మూడు పార్టీలకు కనీసం డిపాజిట్లు రావని జోస్యం చెప్పారు.

KA PAUL
వార్ వన్​సైడే.. ఆ మూడు పార్టీలకు డిపాజిట్లు కూడా దక్కవ్: కేఏ పాల్​

ka paul campaign in munugode మునుగోడు ఉపఎన్నిక ప్రచారం జోరందుకుంది. గెలిచేందుకు ప్రధాన పార్టీల ప్రచారం ఊపందుకుంది. విమర్శలు, ప్రతివిమర్శలతో రాజకీయం మరింత హీటెక్కింది. అయితే ప్రజా శాంతి పార్టీ అధ్యక్షుడు మునుగోడులో పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే తన పార్టీ తరఫున వేసిన నామినేషన్ చెల్లదని ఈసీ ప్రకటించింది. దీంతో స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగిన పాల్... ప్రచారంలో జోరుగా పాల్గొంటున్నారు. అయితే పాల్ ఇచ్చే హామీలు... ప్రజలకు మాత్రం నవ్వులు తెప్పిస్తున్నాయి. మొన్నటికి మొన్న... 6నెలల్లో మునుగోడును అమెరికాను చేసి పడేద్దాం అంటూ వ్యాఖ్యలు చేశారు.

వార్ వన్​సైడే.. ఆ మూడు పార్టీలకు డిపాజిట్లు కూడా దక్కవ్: కేఏ పాల్​

ఈరోజు కూడా మునుగోడు మండల కేంద్రంలో స్వతంత్య్ర అభ్యర్థి కేఏ పాల్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. స్థానికులకు దీపావళి శుభాకాంక్షలు తెలియజేసి... స్వీట్లు పంపిణీ చేశారు. చాయ్​ పెట్టి ప్రజలకు టీ తాగించారు. అంతేనా సెలూన్ షాప్​కు వెళ్లి కటింగ్ చేయించుకున్నారు.

''60 సంవత్సరాల్లో లేని అభివృద్ధి 6నెలల్లో చేసి పడేస్తా.. నేను చేశాననే కేసీఆర్ అన్నారు. అది భాజపా అయినా, కాంగ్రెస్ అయినా, తెరాస అయినా మనకే మద్దతు ఇస్తున్నారు. 6నెలల్లో ఒక మండలానికి కాలేజీ, ఉచిత ఆసుపత్రి, ప్రతి మండలానికి 1000 ఉద్యోగాలు ఇచ్చి... 6నెలల్లో మునుగోడును అమెరికాను చేసి చూపిస్తా. 60శాతం అల్​రెడీ డిసైడ్ చేశారు. ఉంగరం గుర్తుకు ఓటేసి గెలిపించడానికి.. ఇంకా కష్టపడితే ఆ మూడు పార్టీలకు డిపాజిట్లు కూడా రావు. వార్ వన్​సైడ్ అయిపోయిందనే... తెరాస గుండాలు, కాంగ్రెస్ గుండాలు అడ్డుకుంటున్నారు.'' - కేఏ పాల్, స్వతంత్య్ర అభ్యర్థి

ABOUT THE AUTHOR

...view details