తెలంగాణ

telangana

క్రికెట్ బ్యాట్​ పట్టిన మాజీ మంత్రి జానారెడ్డి

By

Published : Feb 19, 2021, 5:23 PM IST

నల్గొండ జిల్లా హాలియాలో శ్రీఛత్రపతి యూత్ ఆధ్వర్యంలో నిర్వహించిన శివాజీ జయంతి వేడుకల్లో మాజీ మంత్రి జానారెడ్డి పాల్గొన్నారు. స్థానికంగా ఏర్పాటు చేసిన క్రెకెట్​ పోటీలను ఆయన ప్రారంభించారు.

ex minister Jana Reddy took the cricket bat at haliya
బ్యాట్​పట్టిన మాజీ మంత్రి జానారెడ్డి

నల్గొండ జిల్లా హాలియాలో శ్రీఛత్రపతి యూత్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన శివాజీ మహారాజ్ జయంతి వేడుకలకు మాజీ సీఎల్పీ నేత కుందూరు జానారెడ్డి హాజరయ్యారు. శివాజీ విగ్రహానికి ఆయన పూలమాల వేసి నివాళులర్పించారు.

శివాజీ జయంతి వేడకల్లో జానారెడ్డి

స్థానికంగా ఏర్పాటు చేసిన జిల్లా స్థాయి క్రికెట్ పోటీలను జానారెడ్డి ప్రారంభించారు. అభిమానుల కోరిక మేరకు కాసేపు క్రికెట్ బ్యాట్ పట్టి ఆలరించారు. ఈ కార్యక్రమంలో స్థానిక యూత్​ సభ్యులు, కాంగ్రెస్​ నేతలు, తదితరులు పాల్గొన్నారు.

ఇదీ చూడండి :21 జిల్లాల్లో ఆయుధ లైసెన్సులు రద్దు

ABOUT THE AUTHOR

...view details