తెలంగాణ

telangana

యాదాద్రి థర్మల్‌ప్లాంట్‌ను పరిశీలించిన కేసీఆర్...

By

Published : Nov 28, 2022, 3:44 PM IST

Updated : Nov 28, 2022, 5:44 PM IST

CM KCR inspected Yadadri Thermal Plant
CM KCR inspected Yadadri Thermal Plant

CM KCR Nalgonda tour నల్గొండ జిల్లా దామరచర్లలోని యాదాద్రి పవర్‌ ప్లాంట్‌ను సీఎం కేసీఆర్‌ సందర్శించారు. ప్లాంట్‌ నిర్మాణ పనులను ఆయన పర్యవేక్షించారు. పనుల పురోగతిపై అధికారులతో చర్చించారు.

CM KCR Nalgonda tour యాదాద్రి థర్మల్‌ పవర్‌ ప్లాంట్ నిర్మాణ పనుల పురోగతిని పరిశీలించేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ నల్గొండ జిల్లా దామరచర్లకు వెళ్లారు. బేగంపేట విమానాశ్రయం నుంచి హెలికాఫ్టర్‌ ద్వారా చేరుకోనున్న సీఎం... ఉన్నతాధికారులతో కలిసి యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ పనుల పురోగతిని పరిశీలిస్తారు. అనంతరం అధికారులతో సమీక్షా సమావేశాన్ని నిర్వహించి సాయంత్రం హైదరాబాద్‌కు తిరిగి వస్తారు.

4 వేల మెగావాట్ల విద్యుదుత్పత్తి సామర్థ్యంతో... యాదాద్రి పవర్ ప్లాంట్ నిర్మిస్తున్నారు. 29 వేల 992 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టిన ఈ ప్లాంట్‌లో.....800 మెగావాట్ల విద్యుదుత్పత్తి స్థాపిత సామర్థ్యంతో మొత్తం 5 ప్లాంట్లు ఉన్నాయి. 2023 డిసెంబరు నాటికల్లా.. యాదాద్రి ప్లాంటులో విద్యుదుత్పత్తి ప్రారంభించి...రాష్ట్రానికి వెలుగులు పంచాలని సీఎం కేసీఆర్ జెన్‌కోకు సూచించారు. ఇదే లక్ష్యంతో.. పనులు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో పనుల పురోగతిని పరిశీలించేందుకు ముఖ్యమంత్రి దామరచర్లకు వెళ్లారు. ఇక సీఎం పర్యటన నేపథ్యంలో పవర్‌ ప్లాంట్‌ భూ నిర్వాసితులు పరిహారం చెల్లించాలని ఆందోళన చేపట్టారు. నిరసనకారులను పోలీసులు అరెస్టు చేసి స్టేషన్‌కు తరలించారు.

ఇవీ చదవండి:

Last Updated :Nov 28, 2022, 5:44 PM IST

ABOUT THE AUTHOR

...view details