తెలంగాణ

telangana

'ఫార్మా కంపెనీల పేరుతో.. పేదల భూమిని ప్రభుత్వం లాక్కుంటోంది'

By

Published : Mar 26, 2022, 7:46 PM IST

rs Praveen kumar fires on cm kcr: నల్గొండ జిల్లా చిట్యాల మండలంలో బీఎస్పీ రాష్ట్ర సమన్వయకర్త ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్‌ చేపట్టిన బహుజన రాజ్యాధికార యాత్ర 21వ రోజు సాగుతోంది. ఈ సందర్భంగా అక్కడి ప్రజలతో మాట్లాడిన ప్రవీణ్‌కుమార్‌... తెరాస సర్కారుపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు.

bsp leader Praveen kumar fires on cm kc
bsp leader Praveen kumar fires on cm kc

rs Praveen kumar fires on cm kcr: తెరాస సర్కార్‌ పాలనలో ప్రజలు అనేక సమస్యలతో అల్లాడుతున్నారని.... బీఎస్పీ రాష్ట్ర సమన్వయకర్త ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్‌ ఆరోపించారు. నల్గొండ జిల్లా చిట్యాల మండలంలో ఆయన చేపట్టిన బహుజన రాజ్యాధికార యాత్ర 21వ రోజు సాగుతోంది. వెలిమినేడులో ఫార్మాకంపెనీల పేరుతో ప్రభుత్వం ప్రజల వద్ద భూమిని బలవంతంగా లాక్కుంటోందని విమర్శించారు. దీనిని ఎట్టి పరిస్థితుల్లో అడ్డుకుంటామని స్పష్టం చేశారు.

'' బీఎస్పీ చేపట్టిన యాత్రకి ప్రజల నుంచి మంచి ఆదరణ ఉంది. రాష్ట్రంలో పేద ప్రజలు పుట్టెడు దుఃఖంలో ఉన్నారు. రైతులకు సాగునీరు ఉన్నా... ఇవ్వడం లేదు. డబుల్‌బెడ్‌రూం ఇళ్లు లేవు. 2005లో మొదలైన ధర్మారెడ్డిపల్లి, పిలయిపల్లి కాల్వలకు ఇప్పటికీ నిధులు ఇవ్వడం లేదు. సీఎం కేసీఆర్ ఈ ప్రాంతం ప్రాజెక్ట్‌కు బడ్జెట్ కేటాయించడం లేదు. ఒకవేళ కేటాయించిన అది పేపర్స్‌కే పరిమితమైంది. ఆ బడ్జెట్ మొత్తం ఆయన ఫామ్‌ హౌస్‌ కాల్వల పనులకు వెళ్తోంది.''

- ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్‌, బీఎస్పీ రాష్ట్ర సమన్వయకర్త

'ఫార్మా కంపెనీల పేరుతో.. పేదల భూమిని ప్రభుత్వం లాక్కుంటోంది'

ABOUT THE AUTHOR

...view details