తెలంగాణ

telangana

Bandi Sanjay padayatra: పాదయాత్రలో ఆసక్తికర సన్నివేశం.. కల్లు రుచి చూసిన బండి సంజయ్

By

Published : Aug 10, 2022, 4:23 PM IST

Bandi Sanjay padayatra: నల్గొండ జిల్లాలో కొనసాగుతున్న బండి సంజయ్ ప్రజాసంగ్రామ మూడో విడత యాత్రలో ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. ఎనిమిదో రోజు పాదయాత్రలో భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కల్లు రుచి చూశారు. కల్లు గీసే గౌడ కార్మికుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు.

Bandi Sanjay
Bandi Sanjay

Bandi Sanjay padayatra: బండి సంజయ్ ప్రజా సంగ్రామ యాత్ర ఎనిమిదో రోజు నల్గొండ జిల్లాలో కొనసాగుతోంది. పాదయాత్రలో ఇవాళ ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. పాదయాత్రంలో భాగంగా గుండ్రంపల్లి నుంచి సుంకనపల్లికి వెళ్తుండగా కల్లు గీత కార్మికులతో ముచ్చటించారు. అంతే కాకుండా కల్లు రుచి చూసి వారి సమస్యలపై ఆరా తీశారు.

తాటి కల్లును తాగిన బండి సంజయ్ కార్మికులతో ఆర్థిక, స్థితిగతులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం గౌడ కార్మికుల కల్లు గీత వృత్తిని కేసీఆర్ ప్రభుత్వం నిర్వీర్యం చేస్తోందని బండి సంజయ్ అన్నారు. అంతే కాకుండా గ్రామగ్రామాన బెల్టు షాపులు, చీప్ లిక్కర్ అమ్ముతున్నారని ఆరోపించారు. ఇవాళ మొత్తం 14.5 కిలోమీటర్ల మేర కొనసాగనున్న బండి సంజయ్ పాదయాత్ర కొనసాగనుంది. ఇవాళ రాత్రికి సిరిపురం సమీపంలో బండి సంజయ్ రాత్రి బస చేయనున్నారు.

తెరాస ప్రభుత్వం 50శాతానికి పైగా ఉన్న బీసీలను రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా అణిచివేస్తోందని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ ఆరోపించారు. బీసీల సంక్షేమానికి బడ్జెట్‌లో నామమాత్రంగా నిధులు కేటాయిస్తూ.. వాటిలోనూ 10శాతం కూడా ఖర్చు పెట్టడం లేదని మండిపడ్డారు. ఈ అంశంపై ఆర్‌టీఐ ద్వారా సేకరించిన సమాచారాన్ని పరిశీలిస్తే అనేక అంశాలు తేటతెల్లమవుతున్నాయని చెప్పారు. ఈ మేరకు ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు.

బీసీ సబ్‌ ప్లాన్ తెస్తామని 2017 బడ్జెట్‌ సమావేశాల్లో సీఎం కేసీఆర్ ప్రకటించినప్పటికీ ఇప్పటి వరకు దానికి అతీగతీ లేదని బండి సంజయ్‌ దుయ్యబట్టారు. 2017లో ఏర్పాటు చేసిన ఎంబీసీ కార్పోరేషన్‌కు గత నాలుగు బడ్జెట్‌లలో రూ.3వేల కోట్లు కేటాయించినట్లు కాగితాల్లో కనిపిస్తున్నా ఖర్చు చేసింది రూ.10కోట్లకు మించలేదని ఆరోపించారు. గొల్లకురుమల కోసం ప్రారంభించిన గొర్రెల పంపిణీ పథకం మూలపడి మూడేళ్లయిందన్నారు. ఇదే మాదిరిగా ఇతర బీసీ సామాజిక వర్గాలకు కూడా అన్యాయమే జరిగిందని ఆరోపించారు. రాష్ట్రంలో సగానికి పైగా బీసీ జనాభా ఉంటే.. అసెంబ్లీలో కేవలం 22 మంది సభ్యులు, మంత్రి వర్గంలో కేవలం ముగ్గురు మంత్రులు మాత్రమే ఉన్నారని ఆక్షేపించారు.

మరోవైపు ఉమ్మడి నల్గొండ జిల్లాలో బండి సంజయ్‌ ‘ప్రజాసంగ్రామ పాదయాత్ర’ కొనసాగుతోంది. నకిరేకల్‌ నియోజకవర్గంలో పర్యటిస్తున్న ఆయన.. స్థానికులతో మాట్లాడుతూ సమస్యలు అడిగి తెలుసుకుంటున్నారు. సుంకెనాపల్లి నుంచి చిట్టెడుగూడెం మీదుగా యాత్ర సాగుతోంది. మార్గమధ్యలో కల్లుగీత కార్మికుల సమస్యలను సంజయ్‌ తెలుసుకున్నారు.

ఇవీ చదవండి:ఎస్సీ వర్గీకరణ, రిజర్వేషన్ల అంశంపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు సుప్రీం నోటీసులు

నీతీశ్​ దెబ్బకు భాజపాకు కొత్త కష్టాలు.. కీలకంగా వైకాపా!

ABOUT THE AUTHOR

...view details