తెలంగాణ

telangana

పొంగి పొర్లుతున్న వాగులు... రాకపోకలకు అంతరాయం

By

Published : Aug 2, 2019, 4:19 PM IST

ములుగు జిల్లాలో జోరు వానలతో వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. ఊర్లన్నీ దిగ్బంధంలో చిక్కుకున్నాయి.

పొంగి పొర్లుతున్న వాగులు... రాకపోకలకు అంతరాయం


ములుగు జిల్లాలో రాత్రి నుంచి ఏకధాటిగా కురుస్తోన్న వర్షానికి వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. చిన్న గంగారం వెళ్లే రహదారిపై వర్షపు నీరు ప్రవహిస్తుంది. తాడ్వాయి మండలంలోని మేడారం జంపన్న వాగు పొంగి పొరలుతోంది. మేడారం జాతరకు వెళ్లే భక్తులకు వరదనీరుతో రాకపోకలకు అంతరాయం కలిగింది. దీనితో భక్తులు వెనుతిరిగి వెళ్తున్నారు.

పొంగి పొర్లుతున్న వాగులు... రాకపోకలకు అంతరాయం

ABOUT THE AUTHOR

...view details