తెలంగాణ

telangana

మేడారం జాతరను జాతీయ పండుగగా గుర్తించాలి : ఇంద్రకరణ్‌రెడ్డి

By

Published : Feb 17, 2022, 3:09 PM IST

Indrakaran reddy Interview : భక్తజన సంద్రంగా మేడారం జాతర మారింది. జంపన్న వాగు సహా జాతర పరిసరాల్లో సందడి నెలకొంది. మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి ఏరియల్‌ వ్యూ నిర్వహించారు. ఈ సందర్భంగా మేడారం జాతరను జాతీయ పండుగగా గుర్తించాలని కోరారు.

Indrakaran reddy Interview, medaram jatara review
మేడారం ఏరియల్‌ వ్యూ నిర్వహించిన మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి

Indrakaran reddy Interview : మేడారం జాతరను జాతీయ పండుగగా గుర్తించాలని... కేంద్రానికి ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా పట్టించుకోవడంలేదని దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. మేడారం పరిసరాల్లో విహంగ వీక్షణం ద్వారా ఏర్పాట్లను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. గతంలో ట్రాఫిక్‌ ఇబ్బందులు తలెత్తేవని.. రాష్ట్రం వచ్చిన తర్వాత భారీగా నిధులు సమకూర్చి అన్ని వసతులు కల్పిస్తున్నామంటున్న మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డితో ఈటీవీ భారత్ ముఖాముఖి.

ములుగు సమ్మక్క-సారలమ్మ జాతర. అతిపెద్ద గిరిజన జాతర. ఇప్పటివరకు జాతర కోసం దాదాపు రూ.350 కోట్లు ఖర్చు చేశాం. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాం. మూడు మాసాల నుంచి ఈ జాతర కోసం ఏర్పాట్లు జరుగుతున్నాయి. మంత్రులు, అధికారులు ఎప్పటికప్పుడూ రివ్యూలు చేశారు. ఎక్కడా ఏ లోటు రాకుండా జాగ్రత్తలు తీసుకున్నాం. గతంలో ట్రాఫిక్ సమస్య ఎక్కువగా ఉంది. భక్తులకు ఇబ్బందులు తలెత్తుతున్నాయని ఇప్పటివరకు ఎటువంటి ఫిర్యాదులు రాలేదు.

-ఇంద్రకరణ్ రెడ్డి, దేవాదాయ శాఖ మంత్రి

మేడారం జాతరను జాతీయ పండగగా గుర్తించాలి. ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా కేంద్రం పట్టించుకోవడం లేదు. గతంలో ట్రాఫిక్‌ ఇబ్బందులు తలెత్తేవి. ప్రత్యేక రాష్ట్రం వచ్చిన తర్వాత భారీగా నిధులు కేటాయిస్తున్నాం. ఎలాంటి లోటుపాట్లు లేకుండా జాతర నిర్వహిస్తున్నాం.

-ఇంద్రకరణ్ రెడ్డి, దేవాదాయ శాఖ మంత్రి

మేడారం ఏరియల్‌ వ్యూ నిర్వహించిన మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి

ఇదీ చదవండి:మేడారం జాతరలో రెండో రోజూ కోలాహలం.. 20 ఏళ్ల తర్వాత అద్భుత ఘట్టం

ABOUT THE AUTHOR

...view details