తెలంగాణ

telangana

రామప్ప ఆలయానికి యునెస్కో గుర్తింపుపై సీఎం కేసీఆర్‌ హర్షం

By

Published : Jul 25, 2021, 7:27 PM IST

Updated : Jul 25, 2021, 10:14 PM IST

రామప్ప ఆలయానికి యునెస్కో గుర్తింపు దక్కడంపై సీఎం కేసీఆర్‌ హర్షం వ్యక్తం చేశారు. యునెస్కో గుర్తింపు కోసం కృషి చేసిన ప్రతిఒక్కరికీ అభినందనలు తెలిపారు.

ramappa
ramappa

ములుగు జిల్లా పాలంపేటలోని చారిత్రక రామప్ప దేవాలయాన్ని ప్రపంచ వారసత్వ కట్టడంగా (వరల్డ్ హెరిటేజ్ సైట్ ) యునెస్కో గుర్తించడం పట్ల సీఎం కేసీఆర్​ వ్యక్తం చేశారు. కాకతీయ రాజులు అత్యంత సృజనాత్మకంగా, శిల్పకళా నైపుణ్యంతో తెలంగాణలో సృష్టించిన ఆధ్యాత్మిక, సాంస్కృతిక సంపద దేశంలోనే ప్రత్యేకమైనదని సీఎం అన్నారు.

స్వయం పాలనలో కూడా తెలంగాణ చారిత్రక వైభవానికి, ఆధ్యాత్మిక సంస్కృతికి పూర్వ వైభవం తేవడంకోసం ప్రభుత్వం కృషి చేస్తుందని చెప్పారు. కాకతీయ రేచర్ల రుద్రుడు నిర్మించిన రామప్పను, ప్రపంచ వారసత్వ కట్టడంగా గుర్తింపుకోసం మద్దతు తెలిపిన యునెస్కో సభ్యత్వ దేశాలకు, సహకరించిన కేంద్ర ప్రభుత్వానికి సీఎం ధన్యవాదాలు తెలిపారు. కృషిచేసిన తెలంగాణ ప్రజా ప్రతినిధులను, ప్రభుత్వాధికారులను సీఎం అభినందించారు.

ఇదీ చూడండి:RAMAPPA TEMPLE UNESCO: రామప్ప దేవాలయానికి యునెస్కో గుర్తింపు

Last Updated :Jul 25, 2021, 10:14 PM IST

ABOUT THE AUTHOR

...view details