తెలంగాణ

telangana

సైనైడ్​తో ఆత్మహత్యాయత్నం.. వ్యక్తి మృతి

By

Published : Nov 18, 2019, 9:15 AM IST

మేడ్చల్​ జిల్లా పట్టణంలోని జాతీయ రహదారి సమీపంలో అనుమానాస్పద స్థితిలో ఓ వ్యక్తి  మృతదేహం లభ్యమైన ఘటన స్థానికంగా కలకలం రేపింది. దీనితో స్థానికులు భయాందోళనలకు గురవుతున్నారు.

సైనైడ్​తో ఆత్మహత్యాయత్నం.. వ్యక్తి మృతి

మేడ్చల్ పట్టణంలోని జాతీయ రహదారికి ఆనుకుని ఉన్న స్నేహాలత క్రేన్ సర్వీస్ సెంటర్ వద్ద అనుమానాస్పద స్థితిలో ఓ వ్యక్తి మృతదేహం ఉన్నట్లు స్థానికులు గుర్తించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి.. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం సికింద్రాబాద్​లోని గాంధీ ఆసుపత్రికి తరలించారు.
మృతుడు హైదరాబాద్​లోని చిక్కడపల్లి ప్రాంతం సూర్యానగర్​కు చెందిన నర్సింహాచారి అని... కుటుంబ కలహాలతో సైనైడ్ తీసుకుని ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసుల విచారణలో తేలింది.

సైనైడ్​తో ఆత్మహత్యాయత్నం.. వ్యక్తి మృతి
Intro:TG_HYD_53_17_MEDCHAL_PERSON_DEATH_AV_TS10016Body:మేడ్చల్ : మేడ్చల్ పట్టణంలో వ్యక్తి మృతదేహం లభ్యం కావడంతో కలకలం చెలరేగింది....
మేడ్చల్ పట్టణంలోని జాతీయ రహదారికి ఆనుకుని ఉన్న స్నేహాలత క్రేన్ సర్వీస్ సెంటర్ వద్ద అనుమానాస్పద స్థితిలో ఓ వ్యక్తి మృతదేహం ఉన్నట్లు స్థానికులు గుర్తించి పోలీస్ లకు సమాచారం అందించారు. హైదరాబాద్ లోని చిక్కడపల్లి ప్రాంతం సూర్య నగర్ కు చెందిన నర్సింహాచారి కుటుంబ కలహాలతో సైనైడ్ తీసుకుని ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసుల విచారణలో తేలింది. స్ధానికుల ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం సికింద్రాబాద్ లోని గాంధీ ఆసుపత్రికి తరలించారు. Conclusion:Visuvals only

ABOUT THE AUTHOR

...view details