తెలంగాణ

telangana

మున్సిపల్​ అధికారులకు పీపీఈ కిట్ల అందజేత

By

Published : May 14, 2020, 8:37 PM IST

కరోనా వైరస్​ ప్రభలుతున్న సమయంలోనూ అనునిత్యం అందుబాటులో ఉంటూ సేవలందిస్తోన్న మున్సిపల్​ సిబ్బందిని ఎమ్మెల్యే వివేకానంద్​ అభినందించారు. మేడ్చల్​ జిల్లా కుత్బుల్లాపూర్​లో మున్సిపల్​ సిబ్బందికి పీపీఈ కిట్లు అందజేశారు.

ppe kits distributed to municipal employees in kutbhullapur
మున్సిపల్​ అధికారులకు పీపీఈ కిట్ల అందజేత

మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్​లో మున్సిపల్ అధికారులకు 100 వ్యక్తిగత రక్షణ సామగ్రి కిట్లను ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ అందజేశారు. కరోనా వైరస్ విజృంభిస్తున్న పరిస్థితుల్లోనూ అనునిత్యం అందుబాటులో ఉంటూ సేవలందిస్తున్న మున్సిపల్​ సిబ్బందిని ఎమ్మెల్యే అభినందించారు.

కొవిడ్​తో జరుగుతున్న పోరాటంలో తమ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా విధులు నిర్వహిస్తున్న వైద్యులు, పోలీసులు, మున్సిపల్ సిబ్బందిని సురక్షింతంగా ఉంచాల్సిన భాద్యత మనందరిపై ఉందని ఎమ్మెల్యే సూచించారు.

ఇదీ చదవండి:'మిగులు జలాల వినియోగంపై పూర్తి వివరాలు సమర్పించండి'

ABOUT THE AUTHOR

...view details