తెలంగాణ

telangana

బైక్​ను ఢీకొట్టిన లారీ... ఇద్దరు యువకులు మృతి

By

Published : Mar 3, 2020, 7:46 PM IST

ద్విచక్రవాహనాన్ని లారీ ఢీకొట్టిన ప్రమాదంలో ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ఘటన కౌడిపల్లి మండలం ధర్మసాగర్ గ్రామ సమీపంలో చోటు చేసుకుంది.

two teenagers killed in road accident at dharmasagar village iin medak
బైక్​ను ఢీకొట్టిన లారీ... ఇద్దరు యువకులు మృతి

మెదక్ జిల్లా కౌడిపల్లి మండలం ధర్మసాగర్‌ గ్రామ సమీపంలో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. లారీ, ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టిన ఘటనలో ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతి చెందారు. కౌడిపల్లి మండలం కుకుట్లపల్లి గ్రామానికి చెందిన శ్రీకాంత్ బంధువులను పరామర్శించడానికి అశోక్​తో కలిసి ద్విచక్రవాహనంపై వెళ్లారు.

బైక్​ను ఢీకొట్టిన లారీ... ఇద్దరు యువకులు మృతి

తిరుగు ప్రయాణమవ్వగా మార్గమధ్యలో లారీ వీరిని ఢీకొట్టింది. ఈ ఘటనలో ఇద్దరు అక్కడికక్కడే మృతిచెందారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేసుకున్నారు. మృతదేహాలను శవపరీక్ష నిమిత్తం నర్సాపూర్ ఆసుపత్రికి తరలించారు.

ఇవీచూడండి:ఎఫెక్ట్: 'విద్యార్థులందరికీ హాల్‌టికెట్లు ఇవ్వండి'

ABOUT THE AUTHOR

...view details