తెలంగాణ

telangana

నీటికుంటలో మొసలి.. ఎలా వచ్చిందని జనం ఆరాలు..

By

Published : Jun 21, 2022, 6:22 PM IST

crocodile: అదొక గ్రామంలోని నీటికుంట. గ్రామస్థులు రోజులాగానే దాని పక్క నుంచి వెళుతుండగా.. నీటిలో ఏదో అలజడి. ఏమిటా అని గమనించగా.. నల్లగా ఏదో కదులుతోంది. మరింత నిశింతగా పరిశీలించగా.. ఒక్కసారిగా గుండె ఆగినంత పనైంది. నీళ్లలో ఉన్నది పాము కాదు.. చేప కాదు.. మొసలి. మెదక్ జిల్లా తుక్కపూర్​లో కనిపించిన మొసలి ఊరంతా కలకలం రేపింది.

నీటికుంటలో మొసలి.. ఎలా వచ్చిందని జనం ఆరాలు..
నీటికుంటలో మొసలి.. ఎలా వచ్చిందని జనం ఆరాలు..

crocodile: మెదక్ జిల్లా కొల్చారం మండల పరిధిలోని తుక్కపూర్​లో గ్రామ పంచాయతీ ముందున్న నీటి కుంటలో మొసలి కలకలం రేపింది. నీటి కుంటలో ఉన్న మొసలిని చూసి స్థానికులు భయాందోళనకు గురయ్యారు. వెంటనే గ్రామస్థులు అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు. మొసలి మంజీరా నది నుండి వచ్చినట్లు గ్రామస్థులు అనుమానిస్తున్నారు. అటవీ శాఖ అధికారులు మొసలిని పట్టుకొని సంగారెడ్డి సంరక్షణ కేంద్రానికి తరలించాలని కోరారు.

ఇవీ చూడండి..

ABOUT THE AUTHOR

...view details