తెలంగాణ

telangana

'రైతు సంక్షేమం కోసమే నూతన వ్యవసాయ బిల్లులు'

By

Published : Oct 7, 2020, 3:59 PM IST

మెదక్ భాజపా కార్యాలయంలో జిల్లా నేతలతో ఆపార్టీ రాష్ట్ర కార్యదర్శి జయశ్రీ సమావేశమయ్యారు. నూతన వ్యవసాయ బిల్లులపై ఆమె మాట్లాడారు. ఈ విషయంలో ప్రతిపక్షాలు అనవసర రాద్ధాంతం చేస్తున్నాయని మండిపడ్డారు.

'రైతు సంక్షేమం కోసమే నూతన వ్యవసాయ బిల్లులు'
'రైతు సంక్షేమం కోసమే నూతన వ్యవసాయ బిల్లులు'

రైతుల సంక్షేమం కోసమే నూతన వ్యవసాయ బిల్లులను ప్రవేశపెట్టారని భాజపా రాష్ట్ర కార్యదర్శి జయశ్రీ తెలిపారు. మెదక్ జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో జిల్లా అధ్యక్షుడు గడ్డం శ్రీనివాస్ ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించారు. నూతన వ్యవసాయ బిల్లుపై దేశ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారని ఆమె తెలిపారు.

ప్రతిపక్షాలకు విమర్శించే హక్కులేదని మండిపడ్డారు. రైతు సంక్షేమమే ధ్యేయంగా ప్రధాని మోదీ పనిచేస్తుంటే ప్రతిపక్షాలు రాద్ధాంతం చేస్తున్నాయని ఆరోపించారు. ఈ చట్టాలను వ్యతిరేకిస్తున్న ప్రతిపక్షాలు చరిత్రలో రైతు ద్రోహిగా నిలుస్తాయని వ్యాఖ్యానించారు.

ఈ సమావేశంలో జిల్లా అధ్యక్షుడు గడ్డం శ్రీనివాస్, జిల్లా ప్రధాన కార్యదర్శి నల్లాల విజయ్ కుమార్, జిల్లా మహిళా మోర్చా విభాగం తరఫున వీణ, నర్సాపూర్ ఇంఛార్జి గోపి, మెదక్ పట్టణ అధ్యక్షుడు గుండు మల్లేశం, మండల అధ్యక్షుడు జనార్దన్ తదితరులు హాజరయ్యారు.

ఇవీచూడండి:శాంతిభద్రతలపై కేసీఆర్​ ఉన్నతస్థాయి సమీక్ష

ABOUT THE AUTHOR

...view details