తెలంగాణ

telangana

సాంకేతికలోపం.. అందుబాటులో ఉన్నోళ్లకే వ్యాక్సిన్

By

Published : Jan 16, 2021, 7:12 PM IST

ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో కొవిడ్​ వ్యాక్సినేషన్ కార్యక్రమం​ విజయవంతమైంది. మెత్తం 330 వైద్యలు, వైద్య సిబ్బందికి టీకా అందించారు.

Vaccine distribution in the joint Adilabad district
ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో​ వ్యాక్సినేషన్ విజయవంతం

ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో 330 వైద్యులు, వైద్య సిబ్బందికి కరోనా టీకా విజయవంతంగా అందించారు. జిల్లాకు 90 మంది వైద్యులు, వైద్య సిబ్బంది చొప్పున ఆదిలాబాద్‌, నిర్మల్‌, కుమురం భీం జిల్లాలో మొత్తం 270 మందికి టీకాలు ఇవ్వగా.. మంచిర్యాల జిల్లాలో మరో 60 మందికి వ్యాక్సిన్ ఇచ్చారు.

అందుబాటులో ఉన్న వారికి..

కొవిన్‌ యాప్‌లో తలెత్తిన సాంకేతిక సమస్యల కారణంగా ఆన్‌లైన్‌లో పేర్లు నమోదుచేసుకున్న వైద్య సిబ్బందికి కాకుండా అప్పటికప్పుడు అందుబాటులో ఉన్న వైద్యులు, వైద్య సిబ్బందికి టీకాలు ఇవ్వాల్సి వచ్చింది. ఆదిలాబాద్‌ రిమ్స్‌ వైద్యకళాశాలలో జరిగిన ప్రారంభ కార్యక్రమంలో ఎంపీ సోయం బాపురావు, ఎమ్మెల్యే జోగు రామన్న, పాలనాధికారి సిక్తా పట్నాయక్‌, జిల్లా పరిషత్ ఛైర్మన్‌ జనార్థన్‌ రాఠోడ్‌ తదితరులు పాల్గొన్నారు.

ఇదీ చూడండి:పాము కాటుకు ఇంటర్​ విద్యార్థిని బలి

ABOUT THE AUTHOR

...view details