తెలంగాణ

telangana

మంచిర్యాలలో మావోల లేఖ.. ఎమ్మెల్యేకు హెచ్చరిక

By

Published : Feb 5, 2021, 9:32 AM IST

మంచిర్యాల జిల్లాలో మావోయిస్టుల లేఖ కలకలం సృష్టించింది. స్థానిక ఎమ్మెల్యే తనయుడు భూదందాలు, కబ్జాలు ఆపాలని హెచ్చరిస్తూ లేఖ విడుదల చేశారు. శ్రీపాద ఎల్లంపల్లి జలశయం ముంపు గ్రామాల ప్రజలకు అండగా ఉంటానని హామీఇచ్చిన ఎమ్మెల్యే మాట తప్పారని లేఖలో తెలిపారు. ఇప్పటికైనా పద్ధతి మార్చుకోకుంటే ప్రజల చేతిలో శిక్ష తప్పదని హెచ్చరించారు.

The letter of the Maoists created a stir in the Manchirala constituency
మంచిర్యాలలో కలకలం రేపుతున్న మావోయిస్టు లేఖ

మంచిర్యాల నియోజక వర్గంలో మావోయిస్టుల లేఖ కలకలం సృష్టించింది. స్థానిక ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్‌ రావు, అతని తనయుడు భూదందాలు, కబ్జాలు ఆపాలని హెచ్చరిస్తూ... మావోయిస్టు పార్టీ సింగరేణి కోల్‌బెల్ట్ కమిటీ కార్యదర్శి ప్రభాత్ పేరుతో లేఖ విడుదల చేశారు. ప్రజల సమస్యలు గాలికి వదిలేసి భూముల సెటిల్మెంట్ల పేరిట అక్రమాలకు పాల్పడుతున్న అధికార పార్టీ నాయకులపై చర్యలు తీసుకుంటామని లేఖలో తెలిపారు.

గుడిపేటలో 2004లో శ్రీపాద ఎల్లంపల్లి జలాశయం నిర్మాణం చేపట్టారని తెలిపారు. అప్పుడు కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిసిన ఈ ఎమ్మెల్యే ముంపు గ్రామాల ప్రజలకు అండగా ఉంటానని హామీఇచ్చి... ఇప్పటికీ వారి సమస్యలు పరిష్కరించడంలేదని ఆరోపించారు.

ఎమ్మెల్యే ముంపు గ్రామాల్లో ఉన్న తన అనుచరులు, అధికారులతో కుమ్మక్కై కోట్ల రూపాయాలు కాజేశారని ఆగ్రహంవ్యక్తం చేశారు. ముంపు గ్రామాల నిర్వాసితులకు పరిహారం చెల్లించాలని అక్కడి నాయకులతో కోర్టులో కేసులు వేయించి... గెలిసిన తర్వాత బాధితుల నుంచి మళ్లీ కమీషన్లు తీసుకున్నారని అన్నారు. గుడిపేటలో ఓ సర్పంచి ఇసుక అక్రమంగా దందా చేస్తున్నారని, వీరి పద్ధతి మార్చుకోకుంటే ప్రజల చేతిలో శిక్ష తప్పదని హెచ్చరించారు.

మావోయిస్టులు విడుదల చేసిన లేఖ

ఇదీ చదవండి:'రాష్ట్ర రాబడి ఆధారంగా బడ్జెట్ ప్రతిపాదనలు రూపొందించాలి'

ABOUT THE AUTHOR

...view details