తెలంగాణ

telangana

కరోనా బాధితులకు మెడికల్ కిట్లు: ఎమ్మెల్యే

By

Published : May 19, 2021, 7:19 PM IST

మంచిర్యాల జిల్లాలోని దాతల సహాయంతో సేకరించిన టెస్టింగ్ కిట్లను జిల్లా కలెక్టర్​కు ఎమ్మెల్యే దివాకర్​రావు అందించారు. పంపిణీకి సిద్ధంగా ఉంచిన కిట్లను జ్వర సర్వే సిబ్బందితోనే పంపిణీ చేస్తామని కలెక్టర్ తెలిపారు.

Manchiryala MLA Divakar rao
Manchiryala MLA Divakar rao

మంచిర్యాల నియోజకవర్గ ప్రజల క్షేమం కోసం దాతల సహాయంతో మెడికల్ కిట్లను ఎమ్మెల్యే దివాకర్​రావు... జిల్లా పాలాధికారి భారతి హోళీకేరికి అందజేశారు. జిల్లాలోని దాతల సహాయంతో 15లక్షల 85వేల రూపాయల విలువగల 3500 మెడికల్​ కిట్లు, 700 ఆక్సీ మీటర్లు, 2500 కరోనా టెస్టింగ్ కిట్లను జిల్లా కలెక్టర్​కు అందజేశామని ఎమ్మెల్యే పేర్కొన్నారు.

దేశంలో ఎక్కడా లేని విధంగా ప్రభుత్వం చేస్తున్న ఇంటింటికి జ్వరం సర్వేలో నిర్ధరణ అయినా బాధితులకు తాము అందించిన మెడికల్ కిట్లు ఉపయోగపడతాయని ఎమ్మెల్యే తెలిపారు. దాతల సహకారంతో పంపిణీకి సిద్ధంగా ఉంచిన కిట్లను జ్వర సర్వే సిబ్బందితోనే పంపిణీ చేస్తామని కలెక్టర్ అన్నారు. దాతలందరికీ ధన్యవాదాలు తెలిపారు.

ఇదీ చూడండి:గాంధీ ఆస్పత్రిలో కొవిడ్ సేవలను పరిశీలించిన సీఎం కేసీఆర్‌

ABOUT THE AUTHOR

...view details