తెలంగాణ

telangana

రైతు వేదికను ప్రారంభించిన అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి

By

Published : Jan 6, 2021, 8:05 PM IST

నీటిపారుదల శాఖలో ఇక నుంచి విభజన ఉండదని... అన్ని కార్యాలయాలు ఒకే గొడుగు కిందికి వస్తాయని మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి స్పష్టం చేశారు. బెల్లంపల్లి మండలంలోని కన్నాల శివారులో రైతు వేదికను, నీటిపారుదల కార్యాలయాన్ని ఆయన ప్రారంభించారు.

allola-indrakaran-reddy-started-the-raithu-vedhika-in-mancherial-district
రైతు వేదికను ప్రారంభించిన అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి

మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మండలంలోని కన్నాల శివారులో రైతు వేదికతో పాటు నీటిపారుదల శాఖ కార్యాలయాన్ని రాష్ట్ర అటవీ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి ప్రారంభించారు. రైతు వేదికను రూ. 22 లక్షలతో నిర్మించగా, నీటిపారుదల శాఖ కార్యాలయాన్ని రూ.2 కోట్ల 50 లక్షలతో నిర్మించారు.

నీటిపారుదల శాఖలో ఇక నుంచి విభజన ఉండదని, అన్ని కార్యాలయాలు ఒకే గొడుగు కిందికి వస్తాయని ఆయన స్పష్టం చేశారు. కార్యక్రమంలో ఎంపీ వెంకటేష్ నేత, ఎమ్మెల్యేలు దుర్గం చిన్నయ్య, దివాకర్ రావు, కలెక్టర్ భారతి హోళీ కేరి, ఎమ్మెల్సీ పురాణం సతీష్ పాల్గొన్నారు.

ఇదీ చూడండి:కిడ్నాప్​ కేసుతో నాకు సంబంధం లేదు: ఏవీ సుబ్బారెడ్డి

ABOUT THE AUTHOR

...view details