తెలంగాణ

telangana

ఉమ్మడి పాలమూరు జిల్లాలో 272 కరోనా కేసులు

By

Published : Aug 12, 2020, 11:10 AM IST

Updated : Aug 12, 2020, 11:15 AM IST

ఉమ్మడి పాలమూరు జిల్లాలో కరోనా ఉద్ధృతి కొనసాగుతోంది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా మంగళవారం 272 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు కాగా.. మహమ్మారి బారినపడి నలుగురు మృతి చెందారు.

today 272 new corona cases registered in combined palamuru district
ఉమ్మడి పాలమూరు జిల్లాలో 272 కరోనా కేసులు

ఉమ్మడి పాలమూరు జిల్లాలో మంగళవారం 272 మందికి కొవిడ్​​ నిర్ధారణ అయ్యింది. అందులో జోగులాంబ గద్వాల జిల్లాలో 105, మహబూబ్‌నగర్‌ 68, వనపర్తి 43, నాగర్‌కర్నూల్‌ 43, నారాయణపేట 13 కేసులు వచ్చాయి. మహమ్మారి బారినపడి నలుగురు మృతి చెందారు.

  • గద్వాల జిల్లా కేంద్రంలో 22 మందికి పాజిటివ్‌ రాగా.. అలంపూర్‌ 21, అయిజ 19, మానవపాడు 14, ధరూర్ 10, గట్టు 8, మల్దకల్‌, రాజోలిలో నలుగురు చొప్పున, ఇటిక్యాలలో మగ్గురు కొవిడ్‌ బారినపడినట్లు వైద్యులు తెలిపారు. గద్వాలలో చికిత్స పొందుతున్న ముగ్గురు, మరొకరు హైదరాబాద్‌లో చికిత్స పొందుతూ మృత్యువాత పడ్డారు.
  • మహబూబ్‌నగర్‌ జిల్లా కేంద్రంలో 36 మందికి వైరస్​ సోకింది. జడ్చర్లలో 14, భూత్పూర్‌ మండలంలో 6, నవాబుపేట 5, మూసాపేట 3, మిడ్జిల్‌, కోయిల్‌కొండ, దేవరకద్ర, గండీడ్‌లో ఒక్కొక్కరు కరోనా బారినపడ్డారు.
  • వనపర్తి జిల్లా కేంద్రంలో 24 మంది, పెబ్బేరులో ఐదుగురు, కొత్తకోటలో నలుగురు, మదనాపూర్​లో ముగ్గురు, పానగల్, గోపాల్​పేటలో ఇద్దరు చొప్పున, పెద్ద మందడి, వీపనగండ్ల, ఖిల్లాగణపూర్, ఒకరు కొవిడ్ బారిన పడినట్టు జిల్లా వైద్యాధికారి తెలిపారు. కొవిడ్‌ బారినపడి ఒకరు మృతి చెందారు.
  • నాగర్‌కర్నూల్‌ జిల్లా కేంద్రంలో 7 మంది, కల్వకుర్తి, కొల్లాపూర్‌లో 8 మంది చొప్పున, తెలకపల్లి 4, బిజినేపల్లి, తాడూరు, ఉప్పునుంతల, వెల్దండ, అచ్చంపేట, పెంట్లవెల్లిలో ఇద్దరు చొప్పున, కోడేరు, పెద్దకొత్తపల్లి, లింగాల, ఉకొండలో ఒక్కరికి చొప్పున కరోనా నిర్ధారణ అయిందని అధికారులు తెలిపారు.
  • నారాయణపేట జిల్లా కేంద్రంలో 6 మంది కరోనా బారినపడగా.. ఉట్కూరులో ఇద్దరు, నర్వ, దామరగిద్ద, మద్దూరు, మరికల్‌, మాగనూరులో ఒక్కొక్కరికి కరోనా పాజిటివ్‌ వచ్చిందని జిల్లా వైద్య అధికారి వివరించారు.
Last Updated : Aug 12, 2020, 11:15 AM IST

ABOUT THE AUTHOR

...view details