తెలంగాణ

telangana

ఊకచెట్టు వాగులో దొరికిన అరుదైన చేప

By

Published : Aug 27, 2020, 4:24 PM IST

మహబూబ్​నగర్ జిల్లా చిన్నచింతకుంటలోని ఊకచెట్టు వాగులో అరుదైన మీనం కనిపించింది. చేపలు పడుతున్న యువకులకు మనుగుమియా అనే చేప దొరికింది.

Rare fish found in a ookachettu vagu
ఊకచెట్టు వాగులో దొరికిన అరుదైన చేప

సముద్ర తీరాల్లో మాత్రమే కనిపించే అరుదైన చేప చిన్నచింతకుంట యువకులకు దొరికింది. మహబూబ్​నగర్​ జిల్లా చిన్నచింతకుంటలోని ఊకచెట్టు వాగులో చేపల వేటకు వెళ్లిన యువకులకు మనుగుమియా చేప కనిపించింది.

మొదట పాము అనుకొని భయపడిన యువకులు... దానిని పరిశీలించగా మనుగుమియా రకం చేపగా గుర్తించి పట్టుకున్నారు. మూడు అడుగుల మేర ఉన్న చేపను స్థానికులు ఆశ్చర్యంగా తిలకించారు. ఇది ఎక్కువగా సముద్రతీర ప్రాంతాల్లో లభిస్తోందని స్థానిక మత్స్యకారులు చెబుతున్నారు. మార్కెట్లో ఈ చేపకు మంచి డిమాండ్ ఉంటుంది. కిలో సుమారు రూ.500 నుంచి 1,000 వరకు పలుకుతుందని తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details