తెలంగాణ

telangana

దేవరకద్ర లక్ష్మీ చెన్నకేశవ ఆలయంలో లక్ష పుష్పార్చన

By

Published : Feb 7, 2021, 10:19 PM IST

శ్రీదేవి, భూదేవి సమేత శ్రీలక్ష్మీ చెన్నకేశవస్వామి ఆలయంలో పుష్పమాసం ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని లక్ష పుష్పార్చన నిర్వహించారు. మహబూబ్​నగర్ జిల్లా దేవరకద్ర నియోజకవర్గ కేంద్రంలో భక్తులు స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు.

Laksha Pushparchana at Sri Lakshmi Chennakesava Temple in devarakadra in mahaboobnagar district
దేవరకద్ర లక్ష్మీ చెన్నకేశవ ఆలయంలో లక్ష పుష్పార్చన

పుష్పమాసం ఏకాదశి పర్వదినం సందర్భంగా శ్రీదేవి భూదేవి సమేత శ్రీ లక్ష్మీ చెన్నకేశవస్వామి ఆలయంలో లక్ష పుష్పార్చన కార్యక్రమం నిర్వహించారు. మహబూబ్​నగర్ జిల్లా దేవరకద్ర నియోజకవర్గ కేంద్రంలోని ఆలయంలో పెద్దఎత్తున మహిళలు పూజలో పాల్గొన్నారు.

దేవరకద్ర లక్ష్మీ చెన్నకేశవ ఆలయంలో లక్ష పుష్పార్చన

మహిళలు పలు రకాల పూలతో స్వామి వారి నామాన్ని స్మరిస్తూ పుష్పార్చన చేశారు. అంతకు ముందు స్వామి వారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. ప్రత్యేక పూజలు ముగిశాక భక్తులకు తీర్థ ప్రసాదాలు పంపిణీ చేశారు.

ఇదీ చూడండి :ప్రతి జిల్లా పరిషత్​కు రూ.10 కోట్లు..!

ABOUT THE AUTHOR

...view details