తెలంగాణ

telangana

ఉద్యోగుల పదోన్నతులు నిరంతర ప్రక్రియ: శ్రీనివాస్​ గౌడ్

By

Published : Jan 31, 2021, 7:21 PM IST

ఉద్యోగుల పదోన్నతుల ప్రక్రియ నేటితో ముగిసేది కాదని... రాష్ట్ర పర్యటక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. నిరుద్యోగులకు త్వరలోనే తీపి కబురు వస్తుందని పేర్కొన్నారు. మహబూబ్​నగర్ జిల్లా కేంద్రంలో ఉద్యోగులకు పదోన్నతుల ఉత్తర్వులను... వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డితో కలిసి అందజేశారు.

Excise Minister Srinivas Gowda handing over promotion orders to employees in mahaboobnagar
ఉద్యోగుల పదోన్నతులు నిరంతర ప్రక్రియ: శ్రీనివాస్​ గౌడ్

​ఉద్యోగుల పదోన్నతుల ప్రక్రియ నేటితో ముగియదని... అది నిరంతర ప్రక్రియని రాష్ట్ర పర్యటక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. ఖాళీలకు అనుగుణంగా ఏడాదిపాటు ఎప్పటికప్పుడు ప్రమోషన్లు అమలవుతాయని వెల్లడించారు. మహబూబ్​నగర్ జిల్లా కేంద్రంలో ఉద్యోగులకు పదోన్నతుల ఉత్తర్వులను... వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డితో కలిసి అందజేశారు.

కోర్టు కేసుల కారణంగా...

కోర్టులో కేసులు ఉండడం వల్ల ప్రస్తుతం ఉపాధ్యాయుల పదోన్నతులు చేపట్టడం లేదని మంత్రి తెలిపారు. పరిష్కారం అయిన వెంటనే ఆ ప్రక్రియ సైతం చేపడతామని చెప్పారు. నిరుద్యోగులకు త్వరలోనే తీపి కబురు వస్తుందని అన్నారు.

బాధ్యత లేకుండా మాట్లాడుతున్నారు...

పీఆర్సీ విషయంలో కొంతమంది బాధ్యత లేకుండా మాట్లాడుతున్నారని... అది మంచి పద్దతి కాదని మంత్రి హితవు పలికారు. కమిటీ నివేదికను పక్కన పెట్టి.. వాస్తవాలను దృష్టిలో పెట్టుకుని ఆలోచిస్తే ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళతామని చెప్పారు. ఉద్యోగులు సంతృప్తి చెంది, ప్రజలు మెచ్చే విధంగా ఏ రకమైన పీఆర్సీ ఉండాలనేది... ఉద్యోగ సంఘాల తరపున నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉందని తెలిపారు. అనంతరం టీఎన్​జీఓ డైరీ ఆవిష్కరణ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.

ఇదీ చదవండి: 'తెలంగాణకు వరద సాయంలో కిషన్​రెడ్డిది కీలకపాత్ర'

ABOUT THE AUTHOR

...view details