తెలంగాణ

telangana

మంత్రి పర్యటనలో భాజపా నాయకుల ఆందోళన.. అరెస్ట్

By

Published : Apr 10, 2021, 8:32 PM IST

మహబూబ్​నగర్ జిల్లా దేవరకద్రలో రైతు వేదికలను మంత్రి శ్రీనివాస్ గౌడ్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో భాజపా నాయకులు అందోళన నిర్వహించగా...పోలీసులు వారిని అరెస్ట్ చేసి పీఎస్​కు తరలించారు.

BJP leaders dharna at minister srinivas goud farmers venues started at  devarakadra mandal
దేవరకద్రలో రైతు వేదికలను ప్రారంభించిన రాష్ట్రమంత్రి శ్రీనివాస్ గౌడ్

మహబూబ్​నగర్ జిల్లా దేవరకద్ర మండలంలో మంత్రి శ్రీనివాస్ గౌడ్ రైతు వేదికలను ప్రారంభించేందుకు రాగా... భాజపా కార్యకర్తలు ఆందోళనకు దిగారు. ప్రధాని మోదీ చిత్రపటం లేకపోవడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్దఎత్తున నినాదాలు చేస్తూ వేదిక వద్దకు దూసుకొచ్చారు. దీంతో పోలీసులు వారిని అడ్డుకోగా.. కాసేపు ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఆందోళనకారులను అదుపులోకి తీసుకుని పీఎస్​కు తరలించారు. అనంతరం రైతు వేదికల ప్రారంభోత్సవం కొనసాగింది.

రైతు వేదికలు ప్రారంభించిన మంత్రి..

రాష్ట్రంలో 70 ఏళ్లుగా ఏ ప్రభుత్వం చేయని సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తూ.. ఇంటింటికి ప్రభుత్వ పథకాలను అందించడం తెరాస సర్కార్​ చేసిన తప్పా అంటూ కాంగ్రెస్, భాజపాను విమర్శించారు. రైతుబంధు, రైతు బీమా పథకాల ద్వారా ఆర్థికంగా ఆసరాగా నిలుస్తున్న తెరాసను ప్రజలు ఆశీర్వదించారని తెలిపారు.

పాలమూరు-రంగారెడ్డికి జాతీయహోదా తీసుకురండి: ఎమ్మెల్యే

కేంద్రంతో పోరాడి రాష్ట్ర భాజపా నాయకులు పాలమూరు-రంగారెడ్డి పథకానికి జాతీయ హోదా కల్పించే విధంగా కృషి చేయాలని ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి సూచించారు. ప్రాజెక్టులపై కోర్టులో కేసులు వేసి అడ్డుకుంటున్నారని విమర్శించారు. అనంతరం కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను లబ్ధిదారులకు అందజేశారు.

రైతు వేదికల ప్రారంభోత్సవం వద్ద భాజపా నాయకుల ఆందోళన

ఇదీ చూడండి:క్రీడల అభివృద్ధికి ఎంతో ప్రాధాన్యం: శ్రీనివాస్​గౌడ్​

ABOUT THE AUTHOR

...view details