తెలంగాణ

telangana

30 మంది విద్యార్థులకు అస్వస్థత... కారణమేంటంటే.?

By

Published : Mar 9, 2022, 9:26 PM IST

Food poison in govt primary school: మహబూబ్‌నగర్‌ జిల్లాలో ఓ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో మధ్యాహ్నం భోజనం తిన్న 30 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. దీనికి కారణం మధ్యాహ్న భోజనమా.. ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయా అని వైద్యారోగ్యశాఖ అధికారులు ఆరాతీస్తున్నారు. అనారోగ్యానికి గురైన విద్యార్థులను ఆసుపత్రికి వెళ్లి కలెక్టర్, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి పరామర్శించారు.

food poison
మధ్యాహ్నం భోజనం వికటించి అస్వస్థత

Food poison in govt primary school: మహబూబ్ నగర్ జిల్లా అడ్డాకుల మండలం పెద్దమునగాలచేడు గ్రామంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో మధ్యాహ్న భోజనం చేసిన అనంతరం 30మంది విద్యార్ధులు అస్వస్థతకు గురయ్యారు.

కడుపునొప్పి, తలతిరగడం, తీవ్రవాంతులు కావడంతో వారిని హూటాహుటిన అడ్డాకుల ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. వారిలో కొందరికి వాంతులు తగ్గకపోవడంతో వెంటనే మహబూబ్ నగర్ జిల్లా ఆసుపత్రికి తీసుకెళ్లారు. సుమారు 18మంది జిల్లా ప్రధాన ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ప్రస్తుతం విద్యార్థుల ఆరోగ్యం నిలకడగా ఉంది. వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారు.

మధ్యాహ్న భోజనమే కారణమా..

students suffer with food poisoning: అడ్డాకుల ఆసుపత్రిలో ఉన్న 12మంది విద్యార్థుల్లో ఆరోగ్యం నిలకడగా ఉన్నవారిని తిరిగి ఇంటికి పంపారు. అస్వస్థతకు కారణం మధ్యాహ్న భోజనమా.. ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయా అని వైద్యారోగ్యశాఖ అధికారులు ఆరాతీస్తున్నారు. మహబూబ్ నగర్ డిప్యూటీ డీఎంహెచ్ఓ శశికాంత్ అడ్డాకుల ప్రాథమిక ఆరోగ్యం కేంద్రం సహా ప్రాథమిక పాఠశాలను సందర్శించారు. ఆహారానికి సంబంధించిన నమూనాలను సేకరించారు.

కాలం చెల్లిన పెరుగు ప్యాకెట్లే కారణమా..

food poison: కాలం చెల్లిన పెరుగు ప్యాకెట్లను పంపిణీ చేయడమే అస్వస్థతకు కారణమై ఉండొచ్చని గ్రామస్థులు, విద్యార్థులు అనుమానం వ్యక్తం చేశారు. విషయం తెలుసుకున్న మహబూబ్ నగర్ జిల్లా కలెక్టర్ ఎస్​.వెంకట్రావు, జిల్లా వైద్యాధికారి కృష్ణ ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రికి వెళ్లి బాధితులను పరామర్శించారు.

ఇదీ చదవండి:Food Poison: అల్పాహారం వికటించి 43 మంది బాలికలకు అస్వస్థత

ABOUT THE AUTHOR

...view details