తెలంగాణ

telangana

అక్రమంగా తరలిస్తున్న గుట్కా ప్యాకెట్ల పట్టివేత

By

Published : Jan 5, 2021, 5:12 PM IST

మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేటలో ద్విచక్రవాహనంపై గుట్కా ప్యాకెట్లు తరలిస్తున్న ఓ వ్యక్తిని పోలీసులు పట్టుకున్నారు. నిందితుడి నుంచి భారీ మొత్తంలో గుట్కా ప్యాకెట్లను, వాహనాన్ని స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశారు.

Seizure of smuggled gutka packets in mahabubabad
అక్రమంగా తరలిస్తున్న గుట్కా ప్యాకెట్ల పట్టివేత

మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేట మండలం కౌసల్యాదేవిపల్లి శివారు వద్ద పోలీసులు వాహనాల తనిఖీ నిర్వహించారు. మరిపెడ వైపు ద్విచక్ర వాహనంపై వెళ్తోన్న ఓ వ్యక్తి అనుమానాస్పదస్థితిలో కనిపించడంతో.. వాహనాన్ని ఆపి తనిఖీ చేశారు. రూ.1.20 లక్షల విలువైన నిషేధిత గుట్కా ప్యాకెట్​లను స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిని అరెస్ట్ చేసి, వాహనాన్ని స్వాధీనం చేసుకున్నట్లు తొర్రూరు డీఎస్పీ వెంకటరమణ తెలిపారు.

నిందితులు తక్కువ ధరకు గుట్కా ప్యాకెట్​లను కొనుగోలు చేసి, బయట వాటిని ఎక్కువ ధరకు విక్రయిస్తున్నట్లు డీఎస్పీ పేర్కొన్నారు. అక్రమ వ్యాపారాలకు పాల్పడిన వారిపై అవసరమైతే పీడీ చట్టం కింద కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు.

ఇదీ చదవండి:కొలనుపాకలో గుట్కా గుట్టురట్టు

ABOUT THE AUTHOR

...view details