తెలంగాణ

telangana

Sathyavathi Rathod: ఆడపిల్లల జోలికి వస్తే ఖబర్దార్: మంత్రి సత్యవతి​

By

Published : Jun 4, 2021, 6:45 PM IST

ఆడపిల్లల జోలికి వస్తే ఊరుకునేది లేదని గిరిజన, స్త్రీ,శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాఠోడ్​(Sathyavathi Rathod) అన్నారు. మహబూబాబాద్‌ జిల్లా మరిపెడ మండలం సీతారాంపురం తండాలో ఇటీవల అత్యాచారంతో పాటు హత్యకు గురైన మైనర్‌ బాలిక కుటుంబాన్ని మంత్రి పరామర్శించారు.

Sathyavathi Rathod: ఆడపిల్లల జోలికి వస్తే ఊరుకునేది లేదు: సత్యవతి రాఠోడ్​
Sathyavathi Rathod: ఆడపిల్లల జోలికి వస్తే ఊరుకునేది లేదు: సత్యవతి రాఠోడ్​

మహబూబాబాద్‌ జిల్లా మరిపెడ మండలం తండధర్మారం శివారు సీతారాంపురం తండాలో ఇటీవల అత్యాచారంతో పాటు హత్యకు గురైన మైనర్‌ బాలిక కుటుంబాన్నిగిరిజన, స్త్రీ,శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాఠోడ్​(Sathyavathi Rathod) పరామర్శించారు. ఆడపిల్లల జోలికి వస్తే ఊరుకునేది లేదన్నారు. దోషులను కఠినంగా శిక్ష పడేలా చూస్తామన్నారు.

బాధిత కుటుంబ సభ్యులను ఓదార్చి ధైర్యం చెప్పారు. ప్రభుత్వం తరఫున ఆదుకుంటామన్నారు. ప్రభుత్వం నుంచి రూ.లక్ష రూపాయలు ఇస్తామన్నారు. ప్రస్తుతం రూ.25 వేల అందజేశారు. మంత్రి వ్యక్తిగతంగా రూ.10 వేలు అందజేశారు.

మాజీ మంత్రి ఈటల ఆత్మ రక్షణ కోసమే తెరాసకు రాజీనామా చేశారని అన్నారు. స్వప్రయోజనం కోసం తెలంగాణ ప్రయోజనాలకు అడ్డుపడే భాజపా కాళ్ల వద్దకు వెళ్లి ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టారని ఆరోపించారు. సీఎం కేసీఆర్‌పై ఈటల చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నట్లు చెప్పారు.

ఇదీ చదవండి:సర్కార్​కు షాక్​- 3,000 మంది వైద్యుల రాజీనామా

ABOUT THE AUTHOR

...view details