తెలంగాణ

telangana

Corona Cases in gurukul college: కళాశాలలో కరోనా కలకలం.. ముగ్గురు విద్యార్థినులకు పాజిటివ్

By

Published : Jan 4, 2022, 11:49 AM IST

Updated : Jan 4, 2022, 12:21 PM IST

Corona Cases in gurukul college, students cases
కళాశాలలో కరోనా కలకలం

11:43 January 04

గురుకుల కళాశాలలో కరోనా కలకలం

Corona Cases in gurukul college : మహబూబాబాద్ జిల్లా కురవి గిరిజన బాలికల గురుకుల కళాశాలలో కరోనా కలకలం రేగింది. ముగ్గురు విద్యార్థినులకు కరోనా పాజిటివ్​గా నిర్ధారణ అయింది. వైరస్ సోకిన ముగ్గురు విద్యార్థినులను హోం ఐసోలేషన్‌లో ఉంచారు. ఇతర విద్యార్థినులకు వైద్యసిబ్బంది కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నారు.

ఇప్పటికే పలు కళాశాలలు, స్కూళ్లలోనూ విద్యార్థులకు కరోనా సోకింది. గురుకుల పాఠశాలలకు చెందిన విద్యార్థులకు నిర్ధారణ అయింది. కాగా ఇటీవల కరోనా కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో మరో గురుకుల కళాశాలలో కరోనా కేసులు నమోదు అయ్యాయి. విద్యార్థులకు వైరస్ సోకుతుండడంతో తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు.

ఇదీ చదవండి:TS Sero-survey: రాష్ట్రంలో ప్రారంభమైన సిరోలెన్స్ సర్వే

Last Updated : Jan 4, 2022, 12:21 PM IST

ABOUT THE AUTHOR

...view details