తెలంగాణ

telangana

బతుకమ్మలు పేర్చి... కోలాటాలు ఆడిన మహిళలు

By

Published : Sep 18, 2020, 9:21 AM IST

తెలంగాణ సంస్కృతి, సంప్రాదాయలను ప్రతిబింబించే పండుగైన బతుకమ్మను మహిళలు ప్రారంభించారు. తీరొక్క పూలతో.. ఎంగిలి పూల బతుకమ్మలు చేసి.. కోలాటాలు ఆడి పండుగను ఆహ్వానించారు.

engili-pula-bathukamma-celebrations-started-in-mahabubabad
బతుకమ్మలు పేర్చి... కోలాటాలు ఆడిన మహిళలు

మహబూబాబాద్ జిల్లా కేసముద్రంలో... మహిళలు బతుకమ్మలు పేర్చి ఆడిపాడారు. తీరొక్క పూలతో ఎంగిలి బతుకమ్మలు చేసి... పండుగను ప్రారంభించారు. అధిక మాసం కారణంగా వచ్చేనెల 16 నుంచి బతుకమ్మ నిర్వహించుకోవాలని పండితులు సూచించినా... పితృ అమావాస్యను పురస్కరించుకుని గురవారమే ఎంగిలి పూల బతుకమ్మను చేసి ఆడిపాడారు. పలు చోట్ల బతుకమ్మలు పేర్చి కోలాటాలు చేశారు. అక్టోబర్​ 17 నుంచి పండుగను కొనసాగించనున్నారు.

ABOUT THE AUTHOR

...view details