తెలంగాణ

telangana

Snake in scooty: " స్కూటీలో దూరింది... రెండు గంటలు ముప్పుతిప్పలు పెట్టింది"

By

Published : Dec 7, 2021, 4:39 PM IST

Snake in scooty

Snake in scooty: పాఠశాల ఆవరణలో పార్కింగ్ చేసిన స్కూటీలోకి పాము దూరి కాసేపు హైరానా పెట్టింది. దాదాపు రెండు గంటలు కష్టపడి... పామును బయటకు తెచ్చారు. ఈ ఘటన మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ పాఠశాలలో చోటుచేసుకుంది

Snake in scooty: పాఠశాల ఆవరణలో పార్కింగ్ చేసిన స్కూటీలోకి పాము దూరిన ఘటన మహబూబాబాద్‌ జిల్లాలో జరిగింది. కేసముద్రం మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ పాఠశాలలో రోజు మాదిరిగానే ఓ ఉపాధ్యాయురాలు స్కూటీని పార్కింగ్‌ చేసింది. స్కూటీలో పామును చూసిన విద్యార్థులు ఉపాధ్యాయులకు చెప్పారు. వారు స్కూటీ వద్దకు వెళ్లి కర్ర సహాయంతో శబ్దం చేసి స్కూటీని కింద పడేశారు. అయినా పాము బయటికి రాలేదు.

Snake in school: దీంతో బైక్ మెకానిక్​తో పాటు పాములు పట్టే వ్యక్తిని పిలిపించారు. స్కూటీలోని ఒక్కొక్క పార్ట్‌ను విడదీసి పరికరాలను ఒక్కొక్కటిగా తొలగించారు. అనంతరం పామును పట్టుకొని అడవిలో వదిలి వేశారు. సుమారు రెండు గంటల పాటు పాఠశాలలో విద్యార్థులు, ఉపాధ్యాయులు భయాందోళనకు గురయ్యారు.

మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ పాఠశాల

ABOUT THE AUTHOR

...view details