Snake in Car Adilabad : కారులో పాము కలకలం.. 50 కిలోమీటర్లు సర్పంతోనే ప్రయాణం

author img

By

Published : Nov 26, 2021, 10:05 AM IST

Updated : Nov 26, 2021, 12:52 PM IST

Snake in Car Adilabad, Snake in Car utnur, కారులో పాము, ఉట్నూరులో కారులో పాము, కారులో పాము కలకలం

Snake in Car Adilabad : పోలీసు కానిస్టేబుల్ తన ఇద్దరు మిత్రులతో కలిసి కారులో ఓ ప్రాంతానికి బయలుదేరాడు. కానీ కారులో వాళ్లతో పాటు మరో ప్రాణి కూడా ఉందని వారికి తెలియదు. దాదాపు 50 కిలోమీటర్లు వెళ్లాక కాళ్ల దగ్గర ఏదో కదులుతున్నట్లు అనిపించి కిందకు చూశారు. ఒక్కసారిగా కాళ్ల కింద ఉన్న పాముని చూసి ఖంగుతిన్నారు. వెంటనే కారులోనుంచి దిగి పరుగు తీశారు.

కారులో పాము కలకలం

Snake in Car Adilabad : పామును చూస్తేనే చాలా మంది ఆమడదూరం పరిగెడతారు. అలాంటిది పాముతోనే 50 కిలోమీటర్లు కారులో ప్రయాణం చేశారు ముగ్గురు వ్యక్తులు. కానీ వాళ్లకి ఆ విషయం తెలియదు. అకస్మాత్తుగా కారులో పామును చూసి భయపడ్డారు. ఒక్క ఉదుటున కారు ఆపి బయటకు పరుగు తీశారు.

Snake in Car Utnur : ఆదిలాబాద్ జిల్లా ఉట్నూరుకు చెందిన పోలీసు కానిస్టేబుల్ వినోద్.. తన ఇద్దరు మిత్రులతో కలిసి ఆదిలాబాద్​కు కారులో బయలుదేరాడు. దాదాపు 50 కిలోమీటర్లు ప్రయాణించిన తర్వాత.. కొద్దిసేపట్లో గమ్యస్థానాన్ని చేరుకుంటామనుకునే సమయంలో ముందు సీట్లో కూర్చున్న వ్యక్తి తన కాళ్ల కింద ఏదో కదలడం గమనించాడు. చూసే సరికి అక్కడ పాము ఉంది.

భయాందోళనకు గురై ముగ్గురు కారులో నుంచి బయటకు పరుగు తీశారు. కాసేపటి తర్వాత కారులో నుంచి పామును బయటకు తీసేందుకు ప్రయత్నించారు. విషయం తెలుసుకున్న స్థానికులు అక్కడ గుమిగూడారు. వారిలో కొంత మంది పామును కారులో నుంచి బయటకు తీసేందుకు ప్రయత్నించగా.. అది బయటకు రాలేదు. ఇక అక్కడి వారి సాయంతో పాములు పట్టే వ్యక్తిని పిలిపించారు. అతడు వచ్చి చాకచక్యంగా కారులో దాక్కున్న పామును బయటకు తీశాడు. దాన్ని సమీపాన ఉన్న అటవీ ప్రాంతంలో వదిలిపెట్టాడు.

Last Updated :Nov 26, 2021, 12:52 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.