తెలంగాణ

telangana

Inspiration: 'ఆత్మవిశ్వాసంతో కూడా వాహనాన్ని నడపొచ్చు మిత్రమా'

By

Published : Jan 8, 2022, 3:12 PM IST

Inspiration

Inspiration: ప్రమాదంలో రెండు చేతులు కోల్పోయినా... ఆత్మవిశ్వాసం చెక్కుచెదరలేదు. ఎక్కడా నిరుత్సాహాపడకుండా డ్రైవింగ్‌లో రాణిస్తూ కుటుంబానికి అండగా నిలుస్తున్నాడు. వైకల్యం ఎదురైనా... డ్రైవింగ్‌తో ప్రతి ఒక్కరి మన్ననలను పొందుతున్నాడు.

ఆత్మవిశ్వాసంతో కూడా వాహనాన్ని నడపొచ్చు మిత్రమా'

Inspiration: ఆత్మవిశ్వాసమే ఆలంబనగా... విద్యుత్ షాక్‌తో రెండు చేతులను మోచేయి వరకు తొలగించినా ఆయన నిరుత్సాహ పడలేదు. నిరుపేద కుటుంబానికి చెందిన తనకు డ్రైవింగ్ తప్ప మరొకటి తెలియదు. ఇంటికి పెద్ద కొడుకు తానే కావడం వల్ల కుటుంబ బాధ్యతలు ఉన్నాయి. ఈ తరుణంలో ఆత్మవిశ్వాసమే ఆలంబనగా పట్టుదలతో డ్రైవింగ్‌పై మరింత పట్టు సాధించాడు. నేడు వందల కిలోమీటర్ల దూరాన్ని సైతం సురక్షితంగా వాహనం నడుపుతూ... ఔరా అనిపిస్తున్నారు.

కుమురం భీం అసిఫాబాద్ జిల్లా రెబ్బెన మండల కేంద్రానికి చెందిన ప్రశాంత్ గౌడ్ 2012లో పెట్రోల్ బంక్ వద్ద జరిగిన విద్యుత్ ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డారు. ఆ ప్రమాదంలో తన రెండు చేతులను మోచేతి వరకు తొలగించారు. సంవత్సరం పాటు మంచానికి పరిమితమయ్యాడు. అనంతరం తనకు తెలిసిన డ్రైవింగ్​నే ఆరు నెలల పాటు సాధన చేసి మరింత పట్టు సాధించాడు. ఫైనాన్స్‌లో వాహనం తీసుకున్నాడు. వివిధ కూరగాయల పంటలను పత్తిని తన వాహనంలో ఆదిలాబాద్, మహారాష్ట్రలోని చంద్రాపూర్, హైదరాబాద్, గోదావరిఖనికి తీసుకెళ్లేవాడు.

2012 నుంచి ఇప్పటివరకు ఒక్క ప్రమాదం కూడా చోటు చేసుకోకుండా వాహనాన్ని సురక్షితంగా గమ్యస్థానానికి చేర్చాడు. ఈ నేపథ్యంలో ప్రజలకు ప్రశాంత్ గౌడ్... డ్రైవింగ్‌పై పూర్తి నమ్మకం ఏర్పడింది. వాహనం డోర్ తీయడం, లాక్ వేయడం, ఫోన్ మాట్లాడడం సొంతంగా చేస్తున్నాడు. తన 9 సంవత్సరాల డ్రైవింగ్‌లో ఒక్క ప్రమాదం కూడా చోటు చేసుకోలేదని ప్రశాంత్ ధీమా వ్యక్తం చేస్తున్నాడు.

ఇలాంటి వారే సమాజానికి ఆదర్శంగా నిలుస్తారని స్థానికులు అభిప్రాయపడుతున్నారు. స్ఫూర్తిని ఎక్కడి నుంచి తీసుకోవాల్సిన అవసరం లేదని... సమాజంలో ఉండే ఇలాంటి వారే ఎంతో స్ఫూర్తిగా నిలుస్తారని పేర్కొంటున్నారు.

సకల జనుల సమ్మె సమయంలో కరెంట్‌ షాక్ తగిలి రెండు చేతులు కోల్పోయాను. ప్రస్తుతం వాహనం నడుపుతున్నాను. సుదూర ప్రాంతాలకు సైతం వెళ్లగలుగుతున్నాను. ఇన్నేళ్ల నా అనుభవంలో ఎలాంటి ప్రమాదాలు చోటుచేసుకోకుండా వాహనం నడపగలిగాను.

-- ప్రశాంత్ గౌడ్, డ్రైవర్

ABOUT THE AUTHOR

...view details