తెలంగాణ

telangana

బస్సులు లేక బడులు మానేస్తున్న విద్యార్థులు

By

Published : Oct 23, 2019, 10:13 AM IST

కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో బస్సులు లేక విద్యార్థులు పాఠశాలకు వెళ్లడానికి తిరిగి ఇంటికి వెళ్లడానికి ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

బస్సులు లేక బడులు మానేస్తున్న విద్యార్థులు

పాఠశాలలు ప్రారంభమై మూడ్రోజులు కావస్తున్నా బస్సులు లేక నానా ఇబ్బందులు పడుతున్నారు విద్యార్థులు. ప్రైవేటు వాహనదారులు, ఆటోవాలాలు ఎక్కువ మొత్తంలో ఛార్జీలు వసూలు చేస్తున్నారు. జిల్లాలోని దూరప్రాంతాల నుంచి వచ్చి చదువుకునే విద్యార్థులకు సరైన సమయంలో బస్సులు లేక చాలా అవస్థలు పడుతున్నారు. ఆర్టీసీ సమ్మె ప్రభావం పాఠశాలలపైనే ఎక్కువగా కనిపిస్తోంది. సమ్మె కారణంగా పాఠశాలల్లో హాజరు శాతం గణనీయంగా తగ్గిపోయిందని ఉపాధ్యాయులు అంటున్నారు.

బస్సులు లేక బడులు మానేస్తున్న విద్యార్థులు
Intro:Body:Conclusion:

ABOUT THE AUTHOR

...view details