తెలంగాణ

telangana

ఉమ్మడిగా మొహర్రం, వినాయకచవితి వేడుకలు

By

Published : Sep 11, 2019, 2:00 PM IST

పీర్ల పండుగను, వినాయక చవితి ఉత్సవాలను ప్రశాంతంగా జరుపుకుంటూ... అవాంఛనీయ ఘటనలు జరగకుండా... కొమురంభీం ఆసిఫాబాద్ ప్రజలు మత సామరస్యానికి ప్రతీకగా నిలుస్తున్నారు.

ఉమ్మడిగా మొహర్రం, వినాయకచవితి వేడుకలు

కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలోని వాంకిడి, ఆసిఫాబాద్, రెబ్బెన ,తిర్యాని, కెరమెరి, జైనూర్, సిర్పూర్ యూ, లింగాపూర్, గాదిగూడ మండలాల్లో భక్తులు పీర్ల ఊరేగింపు ఘనంగా నిర్వహించారు. పీర్లను పట్టుకుని ఇంటింటికి వెళ్లగా భక్తులు కానుకలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. వినాయక ఉత్సవాలను భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తూ మత సామరస్యాన్ని చాటుతున్నారు. హిందూ, ముస్లింలు పండుగలను ఉమ్మడిగా జరుపుకుంటూ ఆదర్శంగా నిలుస్తున్నారు.

ఉమ్మడిగా మొహర్రం, వినాయకచవితి వేడుకలు
Intro:మత సామరస్యానికి ప్రతీకగా పీర్ల ఊరేగింపు

మత సామరస్యానికి ప్రతీకగా నిర్వహించుకునే పీర్ల పండుగ ను ను కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలోని పలు మండలాల్లో ఘనంగా జరుపుకుంటున్నారు. పలు మండలాల్లో వినాయక చవితి సందర్భంగా వినాయక మండపాలు ఏర్పాటు చేసి వినాయక విగ్రహాలను నెలకొల్పి ఈ జిల్లాలో మత సామరస్యానికి ప్రతీకగా కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా నిలిచింది.

కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా లోని వాంకిడి, ఆసిఫాబాద్, రెబ్బెన ,తిర్యాని, కెరమెరి, జైనూర్, సిర్పూర్ u, లింగాపూర్, గాదిగూడ మండలాలలో భక్తులు పీర్ల ఊరేగింపు ఘనంగా నిర్వహించారు. పీర్లను పట్టుకుని ఇంటింటికి వెళ్లగా భక్తులు కానుకలు సమర్పించి మొక్కులు తీర్చుకుంటున్నారు. మత సామరస్యానికి ప్రతీకగా అన్ని వర్గాల ప్రజలు ఈ వేడుకను ఎంతో వైభవంగా జరుపుకుంటున్నారు. పీర్ల నిర్వాహకులు భక్తుల నుదుట విభూది పెట్టి ఆశీర్వాదం అందించారు. ఇది ఇలా ఉండగా మొహరం ,వినాయకచవితి ఒకేసారి రావడంతో కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా లో పీర్లను, గణేష్ విగ్రహాలను వాడ వాడ నా వీధివీధిన పెట్టి మతసామరస్యానికి ప్రతీకగా నిలుస్తుంది. కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా మత సామరస్యానికి ప్రతీకగా హిందూ పండుగ లతో పాటుగా ముస్లిం పండుగలు గ్రామస్తులు ఉమ్మడిగా జరుపుకోవటం ఈ జిల్లా విశిష్టత గా చెప్పుకోవచ్చు. ప్రస్తుతం మొహరం, వినాయక చవితి ఒకేసారి రావడంతో సందడి సందడి గా ఏర్పడింది. ఆయా పండుగలు, పూజల లోను ఇరు కుటుంబాల తో పాల్గొని మొక్కులు చెల్లించుకోవడం దశాబ్దాలుగా ఆనవాయితీగా వస్తోంది. ఇప్పటికీ ఆ సంప్రదాయాన్ని కొనసాగిస్తూ ఆదర్శంగా కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా నిలుస్తోంది.

జి. వెంకటేశ్వర్లు
9849833562
8498889495
ఆసిఫాబాద్
కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా


Body:tg_adb_26_10_oo_vaipu_ghananathudu_maro_vaipu_peerlu_avb_ts10078


Conclusion:

TAGGED:

ABOUT THE AUTHOR

...view details