తెలంగాణ

telangana

రైలులో ఆడబిడ్డకు జన్మనిచ్చిన తల్లి

By

Published : Nov 28, 2019, 9:56 AM IST

ప్రయాణించే రైలులో కాన్పు అయిన ఘటన ఖమ్మం వద్ద  చోటుచేసుకుంది. బిహార్ రాష్ట్రం శివాన్ జిల్లా చెందిన నిండు గర్భిణి పింకీ దేవి ఆంధ్రప్రదేశ్​లోని కొండపల్లికి వెళ్తుండగా రైలులోనే ప్రసవించింది.

women delivery in train at khammam
రైలులో ఆడబిడ్డకు జన్మనిచ్చిన తల్లి

గంగా కావేరి ఎక్స్​ప్రెస్​లో ఓ మహిళ ప్రసవించింది. బిహార్​కు చెందిన పింకీ తన భర్త గణేశ్​ గుప్తాతో కలిసి ఏపీలోని కొండపల్లికి వస్తున్నారు. ఖమ్మం వద్దకు వచ్చేసరికి ఆమెకు పురిటి నెప్పులు వచ్చాయి. రైలులోని శౌచాలయం వద్దనే ఆడబిడ్డకు జన్మనిచ్చింది. సమాచారం అందుకున్న రైల్వే సిబ్బంది తల్లీ బిడ్డను ఖమ్మం మాతా సంరక్షణ కేంద్రానికి తరలించారు.

ఇప్పటికే వారికి ముగ్గురు మగ పిల్లలు ఉండగా నాలుగో సంతానంగా రైలులో ఆడబిడ్డ జన్మించింది. గత మూడురోజులుగా రైలులోనే ప్రయాణం సాగిస్తున్నారు. గంగా కావేరి రైలులో జన్మించిన పాపకు "గంగా కావేరి" అనే పేరు పెడతామని సంతోషంగా చెబుతోంది ఆ తల్లి.

రైలులో ఆడబిడ్డకు జన్మనిచ్చిన తల్లి
ఇదీ చూడండి: 'తెలంగాణలో ఎందుకు పుట్టానురా అనిపిస్తోంది'
Intro:Body:Conclusion:

ABOUT THE AUTHOR

...view details