తెలంగాణ

telangana

కొవిడ్​ నియంత్రణలో దేశానికే తెలంగాణ ఆదర్శం: పువ్వాడ

By

Published : May 19, 2021, 9:52 AM IST

కొవిడ్​ను నియంత్రించడంలో తెలంగాణ రాష్ట్రాన్ని సీఎం కేసీఆర్​ దేశానికే ఆదర్శంగా నిలిపారని మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు. ఖమ్మం జిల్లా మధిరలో కొవిడ్ కేంద్రాన్ని ప్రారంభించిన అనంతరం జరిగిన సభలో ఆయన పాల్గొన్నారు.

Telangana  news
ఖమ్మం వార్తలు

గత ప్రభుత్వాలు చేసిన తప్పిదాల కారణంగా ప్రభుత్వాసుపత్రుల్లో వసతులు కరవయ్యాయని మంత్రి పువ్వాడ ఆరోపించారు. దీనిని తెరాస సర్కారు గుర్తించి అవసరమైన అన్ని సౌకర్యాలు కల్పిస్తూ ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందేలా కృషి చేస్తున్నట్లు వివరించారు. ఖమ్మం జిల్లా పర్యటనలో భాగంగా మధిరలో కొవిడ్​ కేంద్రాన్ని మంత్రి పువ్వాడ ప్రారంభించారు.

నియోజకవర్గ కేంద్రమైన మధిర సివిల్ ఆస్పత్రి అభివృద్ధి చేస్తామని తెలిపారు. కార్యక్రమానికి సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క హాజరయ్యారు. కొవిడ్​ చికిత్సను ఆరోగ్యశ్రీలో చేర్చాలని కోరారు. వ్యాక్సిన్ల సంఖ్యను, పరీక్షల సంఖ్యను పెంచాలని విజ్ఞప్తి చేశారు. ప్రతి పీహెచ్​సీలోనూ ఆక్సిజన్​ పడకలు ఏర్పాటు చేయాలని సూచించారు.

ఇదీ చూడండి:రామగుండం కర్మాగారంలో అమ్మోనియా లీక్​.. ప్రాణభయంతో స్థానికులు

ABOUT THE AUTHOR

...view details