తెలంగాణ

telangana

రైతులకు ఇబ్బంది కలుగకుండా.. కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు

By

Published : Apr 9, 2020, 3:02 PM IST

ఖమ్మం జిల్లాలోని పలు గ్రామాల్లో మంత్రి పువ్వాడ అజయ్​కుమార్ ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు. గతంలో కంటే కొనుగోలు కేంద్రాల సంఖ్య నాలుగు రెట్లు పెంచినట్లు వెల్లడించారు.

minister puvvada ajay kumar opened grain purchasing centers
రైతులకు ఇబ్బంది కలుగకుండా.. కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు

ఖమ్మం జిల్లా వేంసూరు మండలంలోని పలు గ్రామాల్లో మంత్రి పువ్వాడ అజయ్​కుమార్ పర్యటించారు. ఎంపీ నామా నాగేశ్వరరావు, ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్యతో కలిసి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు.

"ప్రతి గింజను కొనుగోలు చేయాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు కేంద్రాల సంఖ్యను నాలుగు రెట్లు పెంచింది. కరోనాను దృష్టిలో పెట్టుకుని రైతులకు ఇబ్బంది కలుగకుండా ఎక్కువ సెంటర్లను ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు."

-మంత్రి పువ్వాడ అజయ్​ కుమార్

రైతులకు ఇబ్బంది కలుగకుండా.. కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు

ఇవీచూడండి:వైద్య సిబ్బంది కోసం హోటల్ ఇచ్చిన సోనూసూద్

ABOUT THE AUTHOR

...view details