తెలంగాణ

telangana

ఏపీ సరిహద్దులో జోరుగా కోడి పందేలు

By

Published : Jan 14, 2021, 10:08 PM IST

సంక్రాంతి పండుగ సందర్భంగా మధిర నియోజకవర్గంలో కోడి పందేలు జోరందుకున్నాయి. ఏపీతో సరిహద్దు పంచుకుంటున్న గ్రామాలు కోడి పందేలకు నిలయాలుగా మారుతున్నాయి.

కోడి పందేలకు అడ్డాగా మధిర నియోజకవర్గం
కోడి పందేలకు అడ్డాగా మధిర నియోజకవర్గం

ఆంధ్రప్రదేశ్​తో సరిహద్దు కలిగి ఉన్న ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గంలోని ప్రాంతాలు కోడిపందేలకు అడ్డాగా మారాయి. సంక్రాంతి పండుగ వచ్చిందంటే చాలు ఆయా ప్రాంతాలు కోడి పందేలకు నిలయాలుగా మారుతున్నాయి. నియోజకవర్గ సరిహద్దు ప్రాంతాల్లో నిర్వహిస్తున్న కోడి పందాలను తిలకించేందుకు సమీప గ్రామాల్లోని ప్రజలు పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు.

సంక్రాంతి పండుగ సందర్భంగా మూడు రోజులపాటు ఈ పందాలు నిర్వహిస్తారని సమాచారం. కోడి పందేలపై బెట్టింగులు కాస్తూ ప్రజలు జేబులు ఖాళీ చేసుకుంటున్నారు. వీటి నిర్వహణకు అధికారులు, పోలీసులకు సైతం పెద్ద ఎత్తున ముడుపులు అందినట్లు సమాచారం. కోడిపందేలతో పాటు జూద క్రీడల సైతం ఇక్కడ పెద్ద ఎత్తున ఏర్పాటు చేశారు.

ఇదీ చదవండి :జోరుగా కోడిపందేలు.. భారీగా చేతులు మారిన పైసలు

ABOUT THE AUTHOR

...view details