తెలంగాణ

telangana

ఖమ్మంలో ఒమిక్రాన్.. అప్రమత్తమైన వైద్య సిబ్బంది..

By

Published : Dec 27, 2021, 11:12 AM IST

First Omicron Case in Khammam: ఓ యువతి ఖమ్మంలోని తన అమ్మమ్మ ఇంటికి వెళ్లగా.. కరోనా లక్షణాలు బయటపడటంతో ఆస్పత్రికి వెళ్లింది. కొవిడ్​ పాజిటివ్​ రాగా.. ఒమిక్రాన్ అనుమానిత పరీక్షల కోసం నమూనాను సిబ్బంది హైదరాబాద్​ పంపించారు. జీనోమ్ సీక్వెన్స్ పరీక్షలు నిర్వహించగా.. పాజిటివ్ రావడంతో వైద్య సిబ్బంది అప్రమత్తమయ్యారు. యువతి కరోనా టీకా రెండు డోసులు తీసుకున్నట్లు వైద్యులు వెల్లడించారు.

Omicron Case in Khammam
ఖమ్మంలో తొలి ఒమిక్రాన్ కేసు

First Omicron Case in Khammam: ఖమ్మం జిల్లాలో తొలి ఒమిక్రాన్‌ కేసు నమోదైంది. హైదరాబాద్‌ గాంధీ ఆస్పత్రి వైరాలజీ ల్యాబ్‌ నుంచి ఆదివారం రాత్రి సమాచారం అందడంతో వైద్యారోగ్యశాఖ అప్రమత్తమైంది. హైదరాబాద్‌లో సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగంచేస్తున్న ఓ యువతి ఈనెల 19న ఖమ్మంలోని ఓ బహుళ అంతస్తులో నివాసముంటున్న అమ్మమ్మ ఇంటికి వచ్చింది. కరోనా అనుమానిత లక్షణాలతో ఈనెల 20న ఖమ్మం జిల్లా కేంద్ర ప్రభుత్వ ప్రధాన ఆస్పత్రిలో ఆర్‌టీపీసీఆర్‌ పరీక్ష చేయించుకోగా కొవిడ్‌ పాజిటివ్‌ అని తేలింది.

యువతి నుంచి సేకరించిన నమూనాను వైద్యసిబ్బంది ఒమిక్రాన్‌ అనుమానిత పరీక్షల కోసం హైదరాబాద్‌కు పంపించారు. అక్కడ జీనోమ్‌ సీక్వెన్స్‌ పరీక్షలు చేయగా పాజిటివ్‌గా వచ్చింది. సమాచారం వచ్చిన వెంటనే ఆరోగ్యశాఖ అప్రమత్తమైంది. వైద్య బృందాలు ఆమె కుటుంబీకులను కలిసి అప్రమత్తం చేశారు. యువతి కరోనా టీకా రెండు డోసులు తీసుకుందని తెలిపారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని తేల్చారు. మిగిలిన కుటుంబ సభ్యుల నుంచి నమూనాలు సేకరించారు. బాధితురాలిని చికిత్స నిమిత్తం హైదరాబాద్‌కు తరలిస్తున్నట్లు వెల్లడించారు.

ఇదీ చూడండి:Omicron Cases in Telangana: రాష్ట్రంలో మరో మూడు ఒమిక్రాన్ కేసులు నమోదు

ABOUT THE AUTHOR

...view details