తెలంగాణ

telangana

Bhatti Vikramarka Interview: 'తెరాస అవినీతి పాలన అంతానికే పీపుల్స్ మార్చ్'

By

Published : Mar 3, 2022, 11:38 AM IST

Bhatti Vikramarka Interview: రాష్ట్ర ఆవిర్భావం తర్వాత తెరాస ప్రభుత్వం దాదాపు 15 లక్షల కోట్లతో బడ్జెట్ ప్రవేశపెట్టినా.. ఏ ఒక్క వర్గానికీ న్యాయం జరగలేదని.. మరి ఇన్ని కోట్ల సంపద ఏమైందని సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క ప్రశ్నించారు. నాలుగున్నర కోట్ల ప్రజలకు దక్కాల్సిన రాష్ట్ర సంపద తెరాస పాలనలో కేవలం కొద్దిమంది చేతుల్లో మాత్రమే ఉందని విమర్శించారు. తెరాస అవినీతి పాలన అంతానికే పీపుల్స్ మార్చ్ మొదలు పెట్టానన్న భట్టి.. తెరాస ప్రభుత్వ తీరుపై నిప్పులు చెరిగారు. ఖమ్మం జిల్లా ముదిగొండ మండలంలో భట్టి పాదయాత్ర కొనసాగుతోంది. నాలుగురోజుల పాదయాత్రలో భాగంగా మొత్తం 75 కిలోమీటర్లు నడిచిన భట్టి.. రైతులు, మహిళలు, నిరుద్యోగుల సమస్యలు అడిగి తెలుసుకుంటున్నారు. రాబోయే అసెంబ్లీ సమావేశాల వేదికగా ప్రజా సమస్యల పరిష్కారం కోసం మరోసారి పోరాటం కొనసాగిస్తామన్నారు. రానున్న బడ్జెట్ సమావేశాల్లో ప్రజా సమస్యల పరిష్కారంతోపాటు ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడతామన్నారు. ప్రస్తుతం శాసనసభ్యుడిగా మధిర నియోజకవర్గంలో పాదయాత్ర చేపట్టినట్లు తెలిపిన భట్టి.. త్వరలోనే మిగతా ప్రాంతాల్లో చేపట్టే అంశంపై నిర్ణయం తీసుకుంటామన్నారు. రాష్ట్రంలో ఎక్కడికక్కడ నేతలు ప్రజాక్షేత్రంలోకి వెళ్లేలా కార్యాచరణ రూపొందిస్తామని అన్నారు. ఎన్నికల కోసం పాదయాత్రలు చేపట్టడం లేదని.. రాష్ట్రంలో ఎన్నికలు ముందస్తు వస్తాయని తాము అనుకోవడం లేదంటున్న భట్టి విక్రమార్కతో ఈటీవీ భారత్​ ముఖాముఖి.

Bhatti Vikramarka Interview: 'తెరాస అవినీతి పాలన అంతానికే పీపుల్స్ మార్చ్'
Bhatti Vikramarka Interview: 'తెరాస అవినీతి పాలన అంతానికే పీపుల్స్ మార్చ్'

'తెరాస అవినీతి పాలన అంతానికే పీపుల్స్ మార్చ్'

సంపద ఖర్చయింది కానీ..

లక్షల కోట్ల సంపదైతే ఖర్చవుతోంది కానీ.. పింఛన్లు రావట్లే.. ఉద్యోగాలు రావట్లే.. డబుల్​ బెడ్​రూం ఇళ్లు రావట్లేదు.. రోడ్లు రావట్లేదు. రైతులకు సంబంధించి గతంలో ఇచ్చిన సబ్సిడీలు కూడా ఇవ్వట్లేదు. ఎరువుల ధరలు విపరీతంగా పెరిగిపోయాయి. రైతులకు పెట్టుబడేమో విపరీతంగా పెరిగింది.. మద్దతు ధరేమో లేదు. తెరాస అధికారంలోకి వచ్చి 8 ఏళ్లు అవుతున్నా 15లక్షల కోట్ల సంపదైతే ఖర్చయింది కానీ... ఎవరికీ పింఛన్లు రాలే.. ఎవరికీ ఇళ్లు రాలే.. ఉద్యోగులు రాలేదు. తెరాస అవినీతి పాలన అంతానికే పీపుల్స్ మార్చ్ మొదలు పెట్టాం. రాబోయే అసెంబ్లీ సమావేశాల వేదికగా ప్రజా సమస్యల పరిష్కారం కోసం మరోసారి పోరాటం కొనసాగిస్తాం. రానున్న బడ్జెట్ సమావేశాల్లో ప్రజా సమస్యల పరిష్కారంతోపాటు ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడతాం.

-భట్టి విక్రమార్క, సీఎల్పీ నేత

ఇదీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details