తెలంగాణ

telangana

కేంద్రం ఎన్ని చట్టాలు తెచ్చినా.. ప్రతీ గింజను కొంటాం: ఈటల

By

Published : Mar 21, 2021, 3:21 PM IST

రైతులు పండించే ప్రతీ గింజను కొనుగోలు చేస్తామని మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. కేంద్రం ఎన్ని చట్టాలు తెచ్చినా ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తామని తెలిపారు. కరీంనగర్​ జిల్లాలోని పలు గ్రామాల్లో పర్యటించిన మంత్రి... అక్కడి రైతు వేదికలు, వైకుంఠధామాలు ప్రారంభించారు.

minister-etela-rajender-inaugurated-rythu-vedika-at-valbhapur-in-karimnagar-district
కేంద్రం ఎన్ని చట్టాలు తెచ్చినా ప్రతీ గింజను కొంటాం: ఈటల

కేంద్ర ప్రభుత్వం ఎన్ని చట్టాలు తెచ్చినా వరిధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రకటించారని వైద్యారోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్‌ అన్నారు. రైతులు పండించిన ప్రతీ గింజను తప్పకుండా కొనుగోలు చేస్తామని హామీ ఇచ్చారు. కరీంనగర్‌ జిల్లా వీణవంక మండలం వల్బాపూర్‌ గ్రామంలో రైతు వేదికను మంత్రి ప్రారంభించారు.

రైతులకు అంకితం..

వ్యవసాయంలో పెట్టబడులు తగ్గి, మంచి పంటలను పండించేందుకు ఈ రైతు వేదికలు పరిశోధన కేంద్రాలుగా మారుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. రైతులకు ఈ వేదికలను అంకితమిస్తున్నామన్నారు. రాష్ట్రం రాకముందు సాగునీరు, కరెంట్‌ కోసం నానా ఇబ్బందులు పడేవాళ్లమని గుర్తు చేశారు. జమ్మికుంట మండలం గండ్రపల్లిలో వైకుంఠధామాన్ని ప్రారంభించారు.

ఈ కార్యక్రమంలో కరీంనగర్‌ జిల్లా పరిషత్‌ ఛైర్‌పర్సన్‌ కనుమల్ల విజయ, ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, రైతులు తదితరులు పాల్గొన్నారు.

ఇదీ చదవండి:పర్యావరణాన్ని కాపాడుకోకపోతే గాలి, నీరు దొరకదు: ఇంద్రకరణ్

ABOUT THE AUTHOR

...view details