తెలంగాణ

telangana

huzurabad by election: హుజూరాబాద్​ ఉపఎన్నిక ప్రచారం.. ఆద్యంతం విమర్శల పర్వం

By

Published : Oct 13, 2021, 5:13 AM IST

Updated : Oct 13, 2021, 6:15 AM IST

హుజూరాబాద్‌ ఉపఎన్నికల గడువు దగ్గర పడుతున్న కొద్ది అన్ని పార్టీలు ప్రచారాన్ని ముమ్మరం చేశాయి (Huzurabad by-election campaign). గ్యాస్ సిలిండర్ ధరలో 291 రూపాయలు రాష్ట్ర ప్రభుత్వ పన్ను ఉందని నిరూపిస్తే తన పదవికి రాజీనామా చేస్తానని మంత్రి హరీశ్‌ రావు అన్నారు. లేకుంటే హుజూరాబాద్ ఉపఎన్నిక పోటీ నుంచి తప్పుకోవాలని భాజపా అభ్యర్థి ఈటల రాజేందర్‌కు హరీశ్​రావు సవాల్ విసిరారు. అధికార పార్టీ కుట్రలను తిప్పికొట్టాలని విజ్ఞప్తి చేస్తూ భాజపా అభ్యర్థి ఈటల రాజేందర్‌ ప్రచారం చేస్తున్నారు. తెరాస... ప్రజలను మోసం చేసిందని పేర్కొంటూ కాంగ్రెస్ తన ప్రచారాన్ని కొనసాగిస్తోంది.

huzurabad
huzurabad

హుజూరాబాద్ ఉపఎన్నికల ప్రచారంలో సవాళ్ల పర్వం కొనసాగుతోంది (Huzurabad by-election campaign). గ్యాస్ సిలిండర్ ధరలో 291 రూపాయలు రాష్ట్ర ప్రభుత్వ పన్ను విధిస్తుందని భాజపా అభ్యర్థి ఈటల రాజేందర్‌ (etela rajendar)ఆరోపించారు. దీనిపై స్పందించిన మంత్రి హరీశ్‌ రావు (Harish Rao) రాష్ట్ర ప్రభుత్వ పన్ను ఉందని నిరూపిస్తే తన పదవికి రాజీనామా చేస్తానని ప్రకటించారు. లేకుంటే హుజూరాబాద్ ఉప ఎన్నిక పోటీ నుంచి తప్పుకోవాలని ఈటల రాజేందర్‌కు హరీశ్​ రావు సవాల్ విసిరారు. హనుమకొండ (hanumakonda) జిల్లా ఎల్కతుర్తి మండలం పెంచికల్ పేటలో నిర్వహించిన వడ్డెర ఆశీర్వాద సభకు మంత్రి హాజరయ్యారు.

నాయకులు వెళ్లిపోయినా... ప్రజలు ఉన్నారు

ధర్మానికి, అధర్మానికి జరుగుతున్న పోరులో ప్రజలు ధర్మం వైపు నిలుస్తారని భాజపా అభ్యర్థి ఈటల రాజేందర్‌ అన్నారు. జమ్మికుంటలోని పలు వార్డుల్లో రోడ్‌షో నిర్వహించిన ఆయన (etela road show) నాయకులు వెళ్లిపోయినా ప్రజలందరూ తనతో ఉన్నారని స్పష్టం చేశారు.

అది ఆయనకు వెన్నతో పెట్టిన విద్య

ఏడేళ్లలో దళితులను తెరాస మోసం చేసిందని కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకులు వి. హనుమంతరావు ( V Hanumanth rao) ఆరోపించారు. జమ్మికుంటలో కాంగ్రెస్ అభ్యర్థి బల్మూరి వెంకట్‌కు (BALLURI VENKAT) మద్దతుగా ఆయన ప్రచారం చేశారు. ముఖ్యమంత్రి ఇచ్చిన ఏ హామీని నిలబెట్టుకోలేదన్న వీహెచ్​...మోసం చేయడం కేసీఆర్‌కు వెన్నతో పెట్టిన విద్యఅని దుయ్యబట్టారు.

ఇదీ చూడండి:Trs Complaints On Etela: ఎన్నికల కోడ్ ఉల్లంఘించారని ఈటలపై కేసులు

Last Updated : Oct 13, 2021, 6:15 AM IST

ABOUT THE AUTHOR

...view details