తెలంగాణ

telangana

ఎండకాలంలో వరుణుడి బీభత్సం

By

Published : May 13, 2019, 7:56 PM IST

ఎండకాలంలో వరుణుడు బీభత్సం సృష్టిస్తున్నాడు. కరీంనగర్ జిల్లాలోని పలు మండలాల్లో వడగళ్లతో కూడిన వర్షం కురిసింది. ఈ వర్షానికి భారీ వృక్షాలు నెలకొరిగాయి.

ఎండకాలంలో వరుణుడి బీభత్సం

కరీంనగర్‌ జిల్లా హుజూరాబాద్​లోని పలు మండలాలలో భారీ ఈదురు గాలులతో కూడిన వర్షం కురిసింది. నియోజకవర్గంలోని వీణవంక, జమ్మికుంట మండలాలలోని పలు గ్రామాలలో వడగళ్లతో కూడిన వర్షం పడింది. భారీ ఈదురుగాలులు వీచాయి. జమ్మికుంటలో వీచిన గాలులకు భారీ వృక్షం నేలకొరిగింది. వీణవంక మండలంలోని పలుగ్రామాలలో విద్యుత్తు స్తంభాలు విరిగిపోయాయి. హుజూరాబాద్‌ మండలంలో వీచిన గాలులకు చెట్లు విరిగిపోయాయి.

ఎండకాలంలో వరుణుడి బీభత్సం
sample description

ABOUT THE AUTHOR

...view details