తెలంగాణ

telangana

Huzurabad ByElection: హుజూరాబాద్​ కాంగ్రెస్​ అభ్యర్థి ఎంపికపై కొనసాగుతున్న సందిగ్ధత

By

Published : Sep 29, 2021, 10:40 PM IST

హుజూరాబాద్​ ఉపఎన్నిక కాంగ్రెస్​ అభ్యర్థి ఎవరనేదానిపై ఇంకా స్పష్టత రాలేదు. నలుగురి పేర్లతో కాంగ్రెస్​ అధిష్ఠానానికి.. పీసీసీ నివేదిక ఇచ్చింది. తాజాగా పీసీసీ అధ్యక్షుడు రేవంత్​రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, పీసీసీ ఎన్నికల నిర్వహణ కమిటీ ఛైర్మన్‌ దామోదర రాజనర్సింహ, మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్‌లు సమావేశమై అభ్యర్థి ఎంపికపై చర్చించారు.

Huzurabad ByElection
Huzurabad ByElection

కరీంనగర్​ జిల్లా హుజూరాబాద్​ ఉపఎన్నిక (Huzurabad ByElection)అభ్యర్థి ఎంపికపై కాంగ్రెస్‌లో సందిగ్ధత కొనసాగుతూనే ఉంది. ఇప్పటికే నలుగురి పేర్లతో కూడిన జాబితా పీసీసీ.. పార్టీ హైకమాండ్​కు పంపింది. అందులో మాజీమంత్రి కొండా సురేఖతోపాటు మరో ముగ్గురి పేర్లు ఉన్నట్లు కాంగ్రెస్‌ వర్గాలు వెల్లడించాయి. ఈ సాయంత్రం సీఎల్పీ కార్యాలయంలో పీసీసీ అధ్యక్షుడు రేవంత్​రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, పీసీసీ ఎన్నికల నిర్వహణ కమిటీ ఛైర్మన్‌ దామోదర రాజనర్సింహ, మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్‌లు సమావేశమై హూజూరాబాద్‌ అభ్యర్థి ఎంపికపై చర్చించారు. పీసీసీ సూచన మేరకే ఏఐసీసీ అభ్యర్థిని ప్రకటించాల్సి ఉండడంతో ఇవాళ సమావేశమైన ముఖ్యనేతలు అధిష్ఠానానికి పంపిన జాబితాపై మరోసారి చర్చించినట్లు తెలుస్తోంది.

గురువారం ప్రకటన..?

ఇప్పటికే అభ్యర్థి ఎంపిక ఆలస్యం అవుతోందన్న వాదన పార్టీలో ఉందని.. వీలైనంత త్వరగా అభ్యర్థిని ప్రకటన వచ్చేట్లు ఏఐసీసీపై ఒత్తిడి తీసుకురావాలని భావిస్తున్నట్లు సమాచారం. పీసీసీ చీఫ్​, సీఎల్పీనేత, పీసీసీ ఎన్నికల నిర్వహణ కమిటీ ఛైర్మన్​.. ఒక అభిప్రాయానికి వచ్చి.. అదే విషయాన్ని పార్టీ రాష్ట్ర వ్యవహారాల బాధ్యుడు తెలియజేయనున్నట్లు తెలుస్తోంది. కాంగ్రెస్​ అభ్యర్థి పేరు గురువారం ప్రకటించే అవకాశం ఉందని పార్టీ ముఖ్యనేత ఒకరు చెప్పారు.

అక్టోబర్​ 30న పోలింగ్​..

మాజీ మంత్రి ఈటల రాజేందర్ రాజీనామాతో హుజూరాబాద్​ నియోజకవర్గం (Huzurabad By Election 2021)లో ఉపఎన్నిక వచ్చింది. ఈ స్థానంలో ఉపఎన్నిక నిర్వహణకు (Huzurabad By Election 2021) షెడ్యూల్​ను ఎన్నికల సంఘం ప్రకటించింది. ఉపఎన్నికకు అక్టోబర్ 2న నోటిఫికేషన్​ ఇవ్వనున్నట్లు పేర్కొంది. అక్టోబర్ 30న హుజూరాబాద్ ఉపఎన్నిక (Huzurabad By Election Polling 2021) పోలింగ్ నిర్వహించనున్నట్లు ఈసీ ప్రకటించింది. నవంబర్ 2న ఓట్ల లెక్కింపు జరపనున్నట్లు తెలిపింది.

ఈటల విస్త్రత ప్రచారం..

తెరాసను వీడి భాజపాలో చేరిన ఈటల రాజేందర్​.. విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. ఇప్పటికే పాదయాత్రతో పాటు ప్రజల దీవెనలు పొందేందుకు విస్తృతంగా పర్యటిస్తున్నారు. ఈటలను ఢీ కొట్టేందుకు తెరాస అస్త్రశస్త్రాలను ప్రయోగిస్తోంది. మంత్రి హరీశ్‌రావు హుజూరాబాద్(huzurabad by election 2021) బాధ్యతలను భుజానికెత్తుకున్నారు. కొన్ని నెలలుగా నియోజకవర్గంలోనే ఉంటూ అన్ని వర్గాలను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికే తెరాస అభ్యర్థిగా గెల్లు శ్రీనివాస్‌ ఖరారవగా అతణ్ని ముందుకు నడిపిస్తూ హరీశ్‌రావు నియోజకవర్గ ప్రజలతో మమేకం అవుతున్నారు. రెండు పార్టీలు ప్రచారంలో దూసుకుపోతున్నాయి.

ఇదీచూడండి:Election Notification 2021 : హుజూరాబాద్​, బద్వేల్ ఉపఎన్నిక షెడ్యూల్ విడుదల

ABOUT THE AUTHOR

...view details